News March 28, 2025
బాపట్ల: టెడ్డీబేర్ వేషంతో హల్‌చల్

టెడ్డీబేర్ వేషంతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టెడ్డీబేర్ వేషం వేసుకుని ఓ వ్యక్తి బాపట్ల పట్టణంలోని సూర్యలంక రహదారిలో కళాశాల వద్ద ప్రజలను ఇబ్బందులకు గురి చేశాడు. పోలీసులకు సమాచారం అందడంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు వీడియోలు తీస్తున్న మరో ఇద్దరిని స్టేషన్‌కు తరలించారు. వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు.
Similar News
News November 9, 2025
బాధపడొద్దు.. తెల్ల జుట్టు మంచిదే : సైంటిస్ట్‌లు

జుట్టు తెల్లబడటం మంచిదే అంటున్నారు జపాన్ శాస్త్రవేత్తలు. శరీరంలో క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేసే ప్రాసెస్‌లో జుట్టు రంగు కోల్పోతుందని చెబుతున్నారు. మెలనోసైట్ సెల్స్ కారణంగా జుట్టు నల్లగా ఉంటుందని, ఎప్పటికప్పుడు కొత్తగా ఏర్పడే ఈ కణాలు జుట్టుకు రంగును అందిస్తాయని అంటున్నారు. శరీరంలో క్యాన్సర్‌గా మారే కణాలను అంతం చేసే ప్రక్రియలో మెలనోసైట్స్ తమను తాము చంపుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
News November 9, 2025
HYD: సైబర్ నేరాల బాధితులు ఫిర్యాదు చేయండి: సీపీ

నగరంలో రోజూ రూ.కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయని సీపీ సజ్జనార్ తెలిపారు. పెట్టుబడుల పేరుతో చాలా యాప్‌లలో ప్రజలు మోసపోతున్నారని, డబ్బు ఊరికే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. APK ఫైల్స్ ద్వారా మోసాలు జరుగుతున్నాయని వివరించారు. సైబర్ నేరాల్లో డబ్బు పోగొట్టుకున్న వెంటనే బాధితులు 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
News November 9, 2025
ఎండల మల్లన్నను దర్శించుకున్న ఎస్పీ

టెక్కలి మండలం రావివలస శ్రీ ఎండల మల్లిఖార్జున స్వామివారిని ఆదివారం సాయంత్రం ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ ఈఓ గురునాథ రావు ఆలయ విశిష్టతను వివరించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. సోమవారం కార్తీకమాసం ఉత్సవం సందర్భంగా భద్రత చర్యలు పటిష్ఠంగా చేపట్టాలని అధికారులకు ఎస్పీ సూచించారు.


