News March 28, 2025
కుప్పకూలిన భవనం.. మరో మృతదేహం లభ్యం

TG: భద్రాచలంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. తాజాగా మరో మృతదేహాన్ని సిబ్బంది వెలికితీశారు. అతడిని భద్రాచలానికి చెందిన ఉపేందర్(38)గా గుర్తించారు. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరు మరణించారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Similar News
News September 14, 2025
బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన శ్రీలంక

ఆసియా కప్ 2025లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాపై శ్రీలంక ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 139/5 రన్స్ మాత్రమే చేసింది. జాకిర్ అలీ (41*), షమీమ్ హుస్సేన్(42*) మాత్రమే రాణించారు. లంక బ్యాటర్లు 32 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ని ముగించేశారు. నిస్సంక హాఫ్ సెంచరీ, కమిల్ మిషారా(46*), కెప్టెన్ అసలంక(10*) రాణించారు. బంగ్లా బౌలర్స్ మహేదీ హసన్ 2, ముస్తఫిజుర్, తన్‌జిమ్ చెరో వికెట్ తీశారు.
News September 14, 2025
ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి: విజయ్

ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సినీ హీరో, TVK చీఫ్ విజయ్ అన్నారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ పేరుతో అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేసి, ఎలక్షన్స్ పెట్టాలని BJP చూస్తోందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని మండిపడ్డారు. 500కుపైగా హామీలు ఇచ్చిన DMK ఎన్ని నెరవేర్చిందని ప్రశ్నించారు. కానీ CM స్టాలిన్ సిగ్గులేకుండా అన్నీ నెరవేర్చామని చెప్పుకుంటున్నారని అరియలూర్ రోడ్ షోలో ఫైరయ్యారు.
News September 14, 2025
బాలయ్య తరఫున సీఎంకు రూ.50 లక్షల చెక్కు అందజేత

TG: భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన కామారెడ్డి సహా ఇతర ప్రాంతాల రైతులకు అండగా నిలిచేందుకు CMRFకు నందమూరి బాలయ్య రూ.50 లక్షల పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెక్కును ఆయన తరఫున చిన్న కూతురు తేజస్విని సీఎం రేవంత్‌కు అందజేశారు. ఇటీవల విరాళం ప్రకటించిన సందర్భంగా భవిష్యత్తులోనూ తన వంతుగా ఇలాంటి సహాయాలు చేస్తానని బాలయ్య పేర్కొన్నారు.