News March 28, 2025
పాలమూరు: పేదింటి బిడ్డ.. సెంట్రల్ GOVT జాబ్ సాధించారు..!

ఆయన పేదింటి యువకుడు.. తల్లిదండ్రుల కష్టం చూసిన అతడు GOVT స్కూల్లో చదువుతూనే ఎలాగైనా ఉన్నత స్థానానికి ఎదగాలని నిశ్చయించుకున్నారు. కష్టపడి చదివి సొంతంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వ నావికాదళంలో జాబ్ సాధించారు.ఆయనే వనపర్తి జిల్లా అమరచింత మండలం మస్తిపురం గ్రామ యువకుడు అశోక్.. తమ స్కూల్ పూర్వ విద్యార్థి అశోక్ జాబ్ కొట్టడం అభినందనీయమని మస్తిపురం ZPHS HMవెంకటన్న ఆయనను సన్మానించారు.
Similar News
News April 2, 2025
ఊర్కోండ: ఒంటరి మహిళ, ప్రేమ జంట కనిపిస్తే అంతే సంగతులు!

ఊర్కోండ మండలంలోని పేట ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో వివాహితపై 8 మంది సామూహిక అత్యాచారం చేసిన ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. కొంతకాలంగా దేవాలయం వద్దకు వచ్చే మహిళల పట్ల పోకిరీల ఆగడాలు అధికమైనట్లు తెలుస్తుంది. గతంలో అనేకమంది మహిళలకు వేధింపులు ఎదురైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
News April 2, 2025
బాలానగర్: రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ బీహార్ వాసి మృతి చెందిన ఘటన బాలానగర్ మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. బీహార్‌కి చెందిన బినోద్ ముర్ము(32) మండల కేంద్రం శివారులోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. మంగళవారం రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News April 2, 2025
MBNR: నేడు ఎస్ఎల్బీసీకి మంత్రి పొంగులేటి రాక

ఎస్ఎల్బీసీ శ్రీశైలం ఎడమ గట్టు సొరంగంలో చిక్కుకొని ప్రాణాలు వదిలిన వారి ఆచూకీ కోసం 38 రోజులుగా సహాయక కొనసాగుతున్నాయి. 24 గంటల పాటు మూడు షిప్టుల్లో 600 మంది రెస్క్యూ బృందాలు శ్రమిస్తూనే ఉన్నారు. ఈ చర్యలను పరిశీలించేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రానున్నారు. మంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే లు రానున్నారు.