News March 28, 2025

హైదరాబాద్‌లో ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు

image

రంజాన్ చివరి శుక్రవారం మక్కా మసీదులో ప్రార్థనలకు ముస్లిం సోదరులు భారీగా రానుండటంతో పోలీసులు HYDలో ఆంక్షలు విధించారు. చార్మినార్ పరిసర ప్రాంతాలకు వచ్చే రోడ్లన్నింటినీ ఉ.8 నుంచి సా.4వరకు మూసేస్తున్నారు. చార్మినార్‌కు వచ్చే నయాపూల్ నుంచి మదీనా, శాలిబండ- హిమ్మత్‌పుర, చౌక్‌మైదాన్-మొగల్‌పుర, మీర్ఆలం మండీ/బీబీ బజార్, మూసాబౌలి- మోతీహాల్, గన్సీబజార్- హైకోర్టు రోడ్డుకు వాహనాలు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News November 9, 2025

జూబ్లీహిల్స్‌లో అంతా గప్‌చుప్..!

image

దాదాపు నెలరోజులుగా స్పీకర్ సౌండ్‌లు, ఓటర్లతో మీటింగ్‌లు, హామీలతో జూబ్లీహిల్స్ నియోజకవర్గం హోరెత్తింది. ఇవాళ ముగింపు ప్రచారంలో 3 ప్రధాన పార్టీల నేతలు చెలరేగిపోయారు. కాగా ఎలక్షన్‌కు 48గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధనతో అంతా గప్‌చుప్ అయింది. ఇక గప్‌చుప్‌గా లోకల్ నేతల హవా నడువనుంది. నోట్ల పంపిణీ, ఓటర్లను మచ్చిక చేసుకోవడం అంతా వీరి చేతుల్లోనే ఉంటుందిక. మళ్లీ సంబరాలు రిజల్ట్స్ డే రోజే ఇక.

News November 9, 2025

గచ్చిబౌలి: ముగిసిన ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ పోటీలు

image

గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్ 2025 బ్యాడ్మింటన్ పోటీలు విజయవంతంగా ముగిశాయి. పలు దేశాల నుంచి ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని ఉత్కంఠభరిత మ్యాచ్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముగింపు కార్యక్రమానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఎండీ డాక్టర్ సోనీ బాలాదేవి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్, కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

News November 9, 2025

‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా యూసుఫ్‌గూడలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ నగరంలో హైడ్రా చేసిన విధ్వంసాలను ప్రజలకు కళ్లకు కట్టినట్లుగా వీడియోలతో చూపించారు. ఈ సందర్భంగా రోడ్ షోలో ఓ వ్యక్తి ‘హైడ్రా నా అస్త్రం.. పేదల ఇళ్లు కూల్చేయడమే నాకిష్టం’ అని రేవంత్ ఫొటోతో ఉన్న బ్యానర్ ప్రదర్శించారు.