News March 28, 2025
IPL: పాపం కావ్య

సీజన్ తొలి మ్యాచ్‌లో 286 రన్స్ చేసి భారీగా అంచనాలు పెంచేసిన SRH రెండో గేమ్‌లో చతికిలపడింది. LSG చేతిలో ఘోరంగా ఓడిపోయింది. దీంతో అభిమానులతో పాటు ఫ్రాంఛైజీ ఓనర్ కావ్యా మారన్ డీలా పడిపోయారు. నిన్న స్టేడియంలో మ్యాచ్ చూస్తూ ఆమె పలికించిన హావభావాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘పాపం కావ్య పాప’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 2, 2025
ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం
News April 2, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 2, 2025
మయన్మార్‌లో మరోసారి భూకంపం

మయన్మార్‌లో మరోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.7గా నమోదైంది. కాగా భూకంపం ధాటికి మయన్మార్‌లో ఇప్పటికే 2,700 మందికిపైగా ప్రజలు మరణించిన విషయం తెలిసిందే. 4500 మందికిపైగా గాయాలపాలయ్యారు. మరోసారి భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భీతిల్లుతున్నారు. రోడ్లపైనే నివసిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు.