News March 28, 2025
నెల్లూరు జిల్లా ప్రజలకు గమనిక

ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ నగదును లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమ చేస్తుందని జాయింట్ కలెక్టర్ కార్తీక్ తెలిపారు. దీపం 2 స్కీం కింద లబ్ధిదారులు సబ్సిడీ అమౌంట్ తమ ఖాతాలో జమ అయిందా లేదా అని https://epds2.ap.gov.in/lpgDeepam/epds పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చని చెప్పారు. వినియోగదారులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవలసిందిగా జాయింట్ కలెక్టర్ కార్తీక్ కోరారు.
Similar News
News April 2, 2025
నెల్లూరు: గురుకులాల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని నెల్లూరు అక్కచెరువు పాడు, గండిపాళెం, తుమ్మల పెంట, ఆత్మకూరు గురుకుల పాఠశాలలో 2025 -26 సంవత్సరానికి గాను 5, 6, 7 ,8 తరగతులలో ప్రవేశం పొందేందుకు అర్హులు ఆన్‌లైన్లో https://aprs.apcfss.in దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల జిల్లా కన్వీనర్ జీ. మురళీకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల ఆరో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. 25న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. సద్వినియోగం చేసుకొవాలన్నారు.
News April 1, 2025
హైదరాబాద్‌లోనే మాజీ మంత్రి కాకాణి..?

మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు కావడంతో ఆయన అరెస్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. కాకాణికి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈక్రమంలో ఆయన పరారీలో ఉన్నారంటూ వదంతులు వచ్చాయి. హైదరాబాద్‌లోని తన నివాసంలో జరగనున్న ఫ్యామిలీ ఫంక్షన్ ఏర్పాట్లను కాకాణి పరిశీలించారంటూ ఆయన సోషల్ మీడియాలో మంగళవారం సాయంత్రం ఓ ఫొటో పోస్ట్ చేశారు. దీంతో ఆయన పరార్ అనే వార్తలకు తెరపడింది.
News April 1, 2025
కాకాణి పారిపోలేదు: MLC

మాజీ మంత్రి కాకాణి కేసుల విషయమై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘గోవర్ధన్ రెడ్డి పారిపోయారని, అరెస్టు అయ్యారని వస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దు. ఆయన తన కుటుంబంతో కలిసి ఉగాది చేసుకోవటానికి హైదరాబాద్ వెళ్లారు. బుధవారం సాయంత్రం లేదా గురువారం నెల్లూరుకు వస్తారు. కాకాణిపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాలని ప్రభుత్వం చూస్తోంది’ అని అన్నారు.