News March 28, 2025

MHBD: పురుగు మందు తాగి వ్యక్తి మృతి

image

పురుగు మందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన MHBD ఈదులపూసపల్లి శివారు శీతల తండా పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఈర్య తండాకు చెందిన బానోత్ రవి పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని తెలిపారు.   

Similar News

News November 5, 2025

‘వనజీవి రామయ్య’ సినిమా ప్రారంభోత్సవానికి ఎంపీకి ఆహ్వానం

image

పద్మశ్రీ వనజీవి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి రావాలని ఎంపీ రఘురాం రెడ్డిని చిత్ర దర్శకులు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. మొక్కలు నాటడానికి జీవితాన్ని అంకితం చేసిన రామయ్య చరిత్రను సినిమాగా రూపొందించడం భావితరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఈ చిత్రంలో నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

News November 5, 2025

VKB: బస్సు ప్రమాద బాధిత కుటుంబానికి స్పీకర్ సాయం

image

చేవెళ్ల బస్సు ప్రమాదంలో మృతి చెందిన ధన్నారం తండాకు(శ్రీరాంనగర్ తండా) చెందిన తారాబాయి కుటుంబానికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.7 లక్షల పరిహారంతో పాటు, తనవంతుగా రూ.1 లక్షను స్పీకర్ అందజేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని స్పీకర్ అన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

News November 5, 2025

మార్చి 31 నాటికి అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి: కలెక్టర్

image

నంద్యాల జిల్లాలో పీఎం జన్మన్ కింద మార్చి 31వ తేదీ నాటికి లబ్ధిదారుల అన్ని ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని హౌసింగ్ పీడీని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 556 ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా, ఇప్పటివరకు 18 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. గ్రౌండింగ్‌లో ఉన్న 281 ఇళ్లు, ఇంకా ప్రారంభించని 257 ఇళ్లను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు.