News March 28, 2025
వజ్రపుకొత్తూరుకు రానున్న సినీ నటి కవిత

వజ్రపుకొత్తూరు మండలంలోని ఒంకులూరు గ్రామానికి శుక్రవారం సినీ నటి కవిత రానున్నారు. గ్రామానికి చెందిన గుంటు వేణుగోపాలరావు గారి ఆధ్వర్యంలో జరగనున్న ఉగాది ఉత్సవాలు సందర్భంగా ఆమె రానున్నట్లు తెలుస్తోంది. గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టనున్నారని నిర్వాహకులు తెలిపారు.
Similar News
News March 13, 2026
16 నుంచి ఒంటిపూట బడులు: డీఈఓ

జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఈనెల 16వ తేదీ సోమవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశాలు జారీచేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రవిబాబు తెలిపారు. ఉదయం 7.45 నుంచి మధ్యాన్నం 12.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. పదో తరగతి పరీక్ష కేంద్రాల పాఠశాలల్లో మధ్యాన్నం 1 నుంచి 4 గంటల వరకు తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.
News March 13, 2026
శ్రీకాకుళంలో జోయాలుక్కాస్ షోరూం ప్రారంభం

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ ‘జోయాలుక్కాస్’ నూతన షోరూం శ్రీకాకుళంలో శుక్రవారం ప్రారంభమైంది. ఎమ్మెల్యే గొండు శంకర్ లాంఛనంగా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి ఆభరణాలను జిల్లా ప్రజల ముంగిటకు తీసుకురావడం అభినందనీయమన్నారు. ఇక్కడ వినియోగదారుల అభిరుచికి తగ్గట్లుగా సరికొత్త డిజైన్లతో కూడిన బంగారం, వజ్రాలు, ప్లాటినం తదితర ఆభరణాల ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచారన్నారు.
News March 13, 2026
పలాస కేంద్రీయ విద్యాలయంపై X లో కేంద్ర మంత్రి పోస్ట్

పలాసలో కేంద్రీయ విద్యాలయం తరగతులు 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ మేరకు శుక్రవారం X లో పోస్ట్ పెట్టారు. కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యాలయం జిల్లాలోని సాయుధ దళాల కుటుంబాలకు, జిల్లా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.


