News March 28, 2025
ఫారిన్ వెళ్లిన ఏలూరు SP, JC

ఏలూరు జిల్లా ఎస్పీ కేపీఎస్ కిశోర్, జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లారు. ఇద్దరూ కలిసి వియత్నాం దేశానికి పయనమయ్యారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు సెలవు పెట్టారు. ఈనేపథ్యంలో ప.గో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్‌కు ఏలూరు జిల్లా ఇన్‌ఛార్జ్ ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు.
Similar News
News November 10, 2025
ఊర్కొండ జిల్లాలో పెరిగిన చలి తీవ్రత

మూడు రోజుల నుంచి నాగర్ కర్నూల్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు 15 డిగ్రీలకు పడిపోయాయి. జిల్లాలోని ఉర్కొండ మండలంలో గడచిన 24 గంటలలో 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. బిజినేపల్లి, వెల్దండ మండలాలలో సైతం 15.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కల్వకుర్తిలో 15.4, పదరలో 15.6, ఉప్పునుంతలలో 15.7, తాడూరులో 15.7, అమ్రాబాద్ లో 15.8, నాగర్‌కర్నూల్‌లో 15.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News November 10, 2025
నిజామాబాద్: కొనసాగుతున్న అనిశ్చితి

డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. హైకమాండ్ నిర్ణయం వాయిదా పడటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల వారీగా పేర్లను ఖరారు చేసినప్పటికీ, చివరి ఆమోదం కోసం వేచిచూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా జిల్లా స్థాయి పార్టీ కార్యకలాపాలు మందగిస్తున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి NZBలో ఎవరెవరు అధ్యక్షులైతే బాగుంటుందో కామెంట్ చేయండి.
News November 10, 2025
హజ్ యాత్రపై సౌదీతో ఒప్పందం.. భారత్ కోటా ఎంతంటే..

హజ్ యాత్రకు సంబంధించి భారత్, సౌదీ అరేబియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. 2026 సంవత్సరానికి గాను భారత్ కోటా కింద 1,75,025 మంది యాత్రికులకు అనుమతివ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు జెడ్డాలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, సౌదీ మంత్రి తౌఫిక్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. హజ్ ఏర్పాట్ల గురించి వీరిద్దరూ సమీక్షించారు. కోఆర్డినేషన్, రవాణా మద్దతు, తీర్థయాత్ర సజావుగా సాగడం వంటి అంశాలపై చర్చించారు.


