News March 25, 2024
మా ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు: డుప్లెసిస్

ఐపీఎల్ 2024లో ఇవాళ పంజాబ్తో మ్యాచులో విజయంతో ఖాతా తెరిచేందుకు ఆర్సీబీ ఎదురు చూస్తోంది. తమ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియం బ్యాటింగ్ చేయడానికి గొప్ప ప్లేస్ అని ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ అన్నారు. జట్టులోని ప్లేయర్లంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు చిన్నస్వామి స్టేడియంలో 84 మ్యాచులు ఆడిన ఆర్సీబీ 39 విజయాలు, 40 పరాజయాలను ఖాతాలో వేసుకుంది. ఒక మ్యాచ్ టై కాగా, నాలుగు మ్యాచుల్లో ఫలితం రాలేదు.
Similar News
News January 31, 2026
పెసర, మినుములో తెల్లదోమ నివారణకు సూచనలు

పెసర, మినుము పంటల్లో తెల్లదోమల ముప్పు పెరిగింది. ఇవి పంటలను ఆశించి మొక్కల ఆకులోని రసాన్ని పీల్చడమే కాకుండా పల్లాకు తెగులును కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా ప్రొఫెనోఫాస్ 1.5ml లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ తామర పురుగులను గుర్తిస్తే లీటరు నీటికి ఎసిఫేట్ 1గ్రా. లేదా డైమిథోయేట్ 2ml కలిపి పిచికారీ చేయాలి.
News January 31, 2026
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్లో ఉద్యోగాలు

<
News January 31, 2026
ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత ఎలెనా రిబకినా

మెల్బోర్న్ వేదికగా జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో ఎలెనా రిబకినా అద్భుత విజయం సాధించారు. అరీనా సబలెంకాపై 6-4, 4-6, 6-4తో పోరాడి గెలిచారు. తీవ్ర ఒత్తిడిలోనూ ధైర్యం కోల్పోకుండా మ్యాచ్ను ముగించారు. 2023 ఫైనల్ పరాజయానికి తాజాగా రిబకినా ప్రతీకారం తీర్చుకున్నారు. తద్వారా తన కెరీర్లో రెండో గ్రాండ్స్లామ్ను సొంతం చేసుకున్నారు.


