News March 28, 2025

కామారెడ్డి: ట్రాక్టర్ కిందపడి బాలుడి మృతి

image

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతిచెందిన ఘటన బొల్లారం PS పరిధిలో చోటుచేసుకుంది. జిన్నారం మం. మాదారంలో ట్రాక్టర్ డ్రైవర్ గంగారం.. కామారెడ్డికి చెందిన సందీప్(12)ను ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఇంజిన్, ట్రాలీకి మధ్య సందీప్ నిలబడగా.. ట్రాక్టర్ చక్రం సందీప్ పై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్ గంగారంపై బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 14, 2025

‘వాహనమిత్ర’కు ఎవరు అర్హులంటే?

image

AP: <<17704079>>వాహనమిత్ర<<>> కింద రూ.15 వేలు పొందాలంటే ఆటో, క్యాబ్ యజమానే డ్రైవర్‌గా ఉండాలి. గూడ్స్ వాహనాలకు వర్తించదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ఫ్యామిలీలో ఒక్క వాహనానికే పథకం వర్తిస్తుంది. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు, IT కట్టేవారు ఉండకూడదు. సిటీల్లో 1000 చ.అ.లకు మించి స్థిరాస్తి ఉన్నవారు అనర్హులు. AP రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్లుండాలి. కరెంట్ బిల్లు నెలకు 300యూనిట్లలోపు రావాలి.

News September 14, 2025

వరి: సెప్టెంబర్‌లో కలుపు, చీడపీడల నివారణ

image

* నాటిన 12 రోజులకు వరి పొలంలో కలుపు ఉంటే సైహలోఫాప్-పి-బ్యులైల్ 1.5ML లేదా బిస్‌ఫైరిబాక్ సోడియం 0.5ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* అగ్గి తెగులు: ఐసోప్రోథయోలేన్ 1.5ML లేదా కాసుగామైసిన్ 2.5ML లేదా ట్రైసైక్లజోల్+మ్యాంకోజెబ్ 2.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
* పాముపొడ తెగులు: హెక్సాకొనజోల్ 2ML లేదా ప్రొపికొనజోల్ 1ML లేదా వాలిడామైసిన్ 2ML లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

News September 14, 2025

గుంటూరు: నష్టపరిహారంగా రూ.1.11 కోట్లు

image

గుంటూరు జిల్లాలో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసులు రాజీ మార్గంలో పరిష్కారమయ్యాయి. ఇందులో సివిల్ కేసులు 908, క్రిమినల్ కేసులు 10,480 ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన శ్రీనివాసుల కుటుంబానికి రూ.1.11 కోట్లు పరిహారం అందజేయడం ప్రధానంగా నిలిచింది. ప్రజలు సమయం, డబ్బు ఆదా చేసుకునేలా ఈ వేదికను మరింతగా వినియోగించుకోవాలని జిల్లా జడ్జి సాయి కళ్యాణ చక్రవర్తి తెలిపారు.