News March 28, 2025

జూన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు

image

జూన్ 6 నుంచి 12వరకు ప్రభుత్వ ఉద్యోగులకు శాఖాపరమైన పరీక్షలు నిర్వహించనున్నట్లు APPSC తెలిపింది. ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. అటు రాష్ట్రంలో వివిధ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలు ముగిసినట్లు వెల్లడించింది. ఇందులో NTR హెల్త్ వర్సిటీ లైబ్రేరియన్, PCB అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్, ఎనలిస్ట్ గ్రేడ్-2, విద్యాశాఖలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు ఉన్నట్లు తెలిపింది.

Similar News

News April 2, 2025

నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

image

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

News April 2, 2025

ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

image

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం

News April 2, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

error: Content is protected !!