News March 28, 2025

రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

image

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.

Similar News

News April 4, 2025

పిల్లలతో RCB ప్లేయర్ల సెల్ఫీలు.. వైరల్

image

టాలెంటెడ్ యంగ్ క్రికెటర్లతో RCB ప్లేయర్లు విరాట్ కోహ్లీ, కృనాల్ పాండ్య, పడిక్కల్ సెల్ఫీలు దిగారు. వారితో సరదాగా మాట్లాడి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తమ ఆరాధ్య క్రికెటర్లతో ఫొటోలు దిగడంతో పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. పైన ఫొటోలు చూడొచ్చు.

News April 4, 2025

NRPT: ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్

image

నారాయణపేట మండలం అప్పంపల్లి గ్రామంలో గత ఫిబ్రవరి 21న ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. లబ్ధిదారు దేవమ్మ అనే మహిళ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కాగా శుక్రవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆ ఇంటి నిర్మాణ పనులను ఈరోజు పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఎంపీడీవో సుదర్శన్, పంచాయతీ కార్యదర్శికి సూచించారు. అలాగే గ్రామంలోని షమీ బేగం, ఆశా బేగం ఇళ్లను పరిశీలించారు.

News April 4, 2025

ASF జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌ఛార్జ్‌ అధికారిగా నదీమ్

image

ఆసిఫాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ అధికారిగా అబ్దుల్ నదీమ్ ఖుద్దూసీ నియమితులయ్యారు. నదీమ్ జిల్లా హార్టికల్చర్ (ఉద్యానవన ) అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

error: Content is protected !!