News March 28, 2025
రేపు సూర్యగ్రహణం

ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం రేపు ఏర్పడనుంది. అయితే భారత కాలమానం ప్రకారం ఇది రాత్రివేళ సంభవిస్తుండటంతో మనదేశంలో కనిపించదని ఖగోళ సైంటిస్టులు చెబుతున్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్, అట్లాంటిక్, ఉత్తర, దక్షిణ అమెరికాలోని పలు దేశాల్లో సూర్యగ్రహణం కనువిందు చేయనుంది. అక్కడి కాలమానం ప్రకారం మ.2.20 గంటలకు ప్రారంభమై సా.4.17 గంటలకు సంపూర్ణ దశకు చేరుకుంటుంది. సా. 6.13 గంటలకు సూర్యగ్రహణం పూర్తవుతుంది.
Similar News
News April 4, 2025
టారిఫ్ లిస్టులో పెంగ్విన్ ద్వీపం.. ట్రంప్.. పాపం!

ట్రంప్ టారిఫ్ లిస్ట్ ప్రపంచాన్ని కలవరపెడుతుంటే సోషల్ ప్రపంచం మాత్రం ఆయన్ను ఆడేసుకుంటోంది. ప్రతీకార సుంకాల లిస్టులో ఆస్ట్రేలియా పరిధిలోని మెక్‌డొనాల్డ్ ద్వీపం (అంటార్కిటికా ఖండ ఉపభాగం) కూడా ఉంది. ఈ ద్వీపంలో మనుషులే ఉండరు. పెంగ్విన్లు మాత్రమే నివసించే ఈ ప్రాంతం కూడా 10% దిగుమతి టారిఫ్‌కు గురవడంతో మీమర్స్ బుర్రను షార్ప్ చేసి ట్రంప్‌ను చెక్కేస్తున్నారు. పైన గ్యాలరీలో మీరు కొన్ని మీమ్స్ చూడవచ్చు.
News April 4, 2025
రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉంది: మంత్రి సంధ్యారాణి

AP: వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో రూ.కోట్లు దోచుకున్నారని మంత్రి సంధ్యారాణి ఆరోపించారు. మాజీ మంత్రి రోజా గురించి మాట్లాడాలంటేనే రోతగా ఉందని వ్యాఖ్యానించారు. అధికారం ఉందని ఇష్టానుసారంగా మాట్లాడినందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. రెడ్‌బుక్ పేరు చెబితేనే వైసీపీ నేతలకు వణుకు పుడుతోందని సంధ్యారాణి అన్నారు.
News April 4, 2025
సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం ఆగ్రహం

AP: సచివాలయంలో <<15986572>>అగ్నిప్రమాదం<<>> జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే అన్ని చోట్లా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను క్లియర్ చేయాలని ఆదేశించారు.