News March 28, 2025
GNT: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.
Similar News
News November 9, 2025
ప్రతి రైతుకు పరిహారం అందాలి: మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ నష్టాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, పక్కాగా నివేదిక తయారు చేయాలని సూచించారు. రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల శాఖలకు సంబంధించి దెబ్బతిన్న నిర్మాణాలు, పంట నష్టాన్ని పూర్తి ఆధారాలతో నివేదించాలని, నష్టపోయిన వారికి సహాయం అందించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
News November 9, 2025
చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.
News November 9, 2025
ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.


