News March 28, 2025

కొనకనమిట్ల: తమ్ముడి కళ్ల ఎదుటే అన్న మృతి

image

చిలకలూరిపేట బైపాస్ రోడ్డులో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కొనకనమిట్ల(M) సిద్దవరానికి చెందిన చప్పిడి రమేశ్ (25) తమ్ముడు చిన్నాతో బైకుపై వెళ్తున్నారు. ముందుగా వెళుతున్న లారీని బైక్ ఢీకొట్టడంతో రమేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. చిన్నాకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తమ్ముడి కళ్లదుటే అన్న మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 5, 2026

మార్కాపురం కొత్త జిల్లా.. కాకమీదున్న పాలిటిక్స్!

image

మార్కాపురం జిల్లాలో పొలిటికల్ హీట్ కనిపిస్తోంది. జిల్లాలో అంతర్భాగమైన Y పాలెం పాలిటిక్స్ హీట్ పీక్స్‌కు చేరింది. MLA తాటిపర్తి చంద్రశేఖర్ ఇటీవల జడ్పీ సమావేశంలో ప్రొటోకాల్ విషయమై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎమ్మెల్యే విమర్శలపై టీడీపీ ఇన్‌ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఫైర్ అయ్యారు. ఆయన ఇన్‌ఛార్జ్‌‌గా ఉన్న సమయంలో ప్రొటోకాల్ గుర్తులేదా అంటూ ఎరిక్షన్ బాబు ప్రశ్నించారు. ఇలా వీరి మధ్య విమర్శల జోరు ఊపందుకుంది.

News January 4, 2026

పారిశుద్ధ్య కార్మికులకు ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేసిన మంత్రి

image

కొండపి, టంగుటూరు, సింగరాయకొండ మండలాలకు ఎలక్ట్రిక్ ఆటో ఆదివారం మంత్రి స్వామి ఒంగోలు కలెక్టరేట్ ఆవరణంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరావు డీపీ‌ఆర్‌సీ జిల్లా కోఆర్డినేటర్ మల్లికార్జున్ ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయుటకు ఈ ఆటోలు ఉపయోగపడతాయన్నారు.

News January 4, 2026

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు భద్రం: ఇన్‌ఛార్జ్ SP

image

ఫేక్ లోన్ యాప్‌ల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని మార్కాపురం జిల్లా ఇన్‌ఛార్జ్ SP హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా లోన్ అంటే ఆశపడవద్దన్నారు. వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్‌లలో వచ్చే నకిలీ లోన్ యాప్స్ నమ్మవద్దన్నారు. డాటాను సైబర్ మోసగాళ్ల చేతిలో పెట్టవద్దన్నారు. ఈజీగా లోన్ వస్తుందని చిక్కుల్లో పడవద్దని హెచ్చరించారు.