News March 28, 2025

ప.గో: 15 ఉపసర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 15 గ్రామ పంచాయతీల పరిధిలోని ఉపసర్పంచ్‌ల స్థానాలకు గురువారం ఉప ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 15 ఉప సర్పంచుల స్థానాల్లో ఆయా వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో ప్రశాంతంగా ఎన్నిక ప్రక్రియ ముగిసింది. మరోవైపు పదవీకాలం కేవలం 9 నెలలు మాత్రమే ఉండడంతో ఈ ఎన్నికపై పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు.

Similar News

News September 11, 2025

మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా దృష్టి: కలెక్టర్

image

స్వయం సహాయక సంఘాల మహిళలకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ఉపాధి అంశంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ రూపొందించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ప్రతి మండలంలో మూడు యూనిట్లు తప్పనిసరిగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News September 11, 2025

‘ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై తనిఖీ చేయాలి’

image

గ్రామ స్థాయిలో ఆక్వా జోనేషన్ విస్తీర్ణం నిర్ధారణపై మండల స్థాయి అధికారులు తనిఖీ చేసి వెంటనే నివేదికను అందజేయాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఫ్రెష్ వాటర్ ఆక్వాకల్చర్ మండల స్థాయి కమిటీ అధికారులతో ఆక్వా జోనేషన్ ప్రతిపాదనలపై సమీక్షించారు. గ్రామ స్థాయి నుంచి ఆక్వా జోనేషన్ విస్తీర్ణాన్ని తనిఖీ చేసి జిల్లా స్థాయి కమిటికి పూర్తి స్థాయిలో నివేదిక అందించాలన్నారు.

News September 10, 2025

హెక్తాన్-25 విజేతలకు బహుమతుల ప్రదానం

image

ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి బుధవారం రాత్రి భీమవరంలో నిర్వహించిన అమరావతి క్వాంటం వ్యాలీ హెక్తాన్-25 సెమీఫైనల్స్‌లో విన్నర్స్‌, రన్నర్స్‌కు కలెక్టర్ నాగరాణి బహుమతులు అందించారు. విన్నర్స్‌గా భీమవరం, రాజమండ్రి, సూరంపాలెం, కాకినాడ కళాశాలలు దక్కించుకున్నాయి. రన్నర్స్‌గా తుని, రాజమండ్రి, భీమవరం, సూరంపాలెం, గైడ్ ఇంజినీరింగ్ కాలేజీ, రాజమండ్రి కళాశాల నిలిచాయి.