News March 25, 2024
జెర్సీపై ఆ లోగో లేకుండానే ఆడిన సీఎస్కే ప్లేయర్

బంగ్లాదేశ్ ప్లేయర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఐపీఎల్‌లో సీఎస్కే తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. జెర్సీపై మద్యం కంపెనీ లోగోను వేసుకునేందుకు నిరాకరించారు. మతపరమైన కారణాలతో ఆయన ఈ లోగోను నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో జెర్సీపై ఆ లోగో లేకుండానే బరిలోకి దిగారు. గతంలో ఆమ్లా, మొయిన్ అలీ వంటి ప్లేయర్లు కూడా ఇలాగే బరిలోకి దిగారు.
Similar News
News February 2, 2026
ఎరువుల ధరలు పెరిగే అవకాశం!

ఎరువుల తయారీలో కీలక ముడిపదార్థాలైన అమ్మోనియం ఫాస్పేట్, అమ్మోనియం నైట్రో ఫాస్పేట్, పొటాషియం సల్ఫేట్ లాంటి ఉత్పత్తులపై కేంద్రం బేసిక్ కస్టమ్స్ డ్యూటీ (BCD) మినహాయింపులను రద్దు చేసింది. దీని వల్ల DAP, NPK వంటి కాంప్లెక్స్ ఎరువుల తయారీ ఖర్చు పెరుగుతుంది. ఫాస్పేట్, పొటాష్ ఆధారిత ఎరువుల ముడి సరుకులను మనం ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఈ తరుణంలో ఎరువుల ధరలు కూడా పెరిగే ఛాన్సుంది.
News February 2, 2026
జీఎస్టీ వసూళ్లలో తెలంగాణలో 5% వృద్ధి

TG: ఈ ఏడాది జనవరిలో GST వసూళ్లలో 5% వృద్ధి నమోదైంది. 2025 జనవరిలో రూ.4,068 కోట్లు రాగా ఈ సారి రూ.4,261 కోట్ల పన్నులు వసూలయ్యాయి. మరోవైపు 2025లో 4 శ్లాబుల జీఎస్టీ రేట్లను రెండుకు తగ్గించడంతో కలెక్షన్లు మందకొడిగా ఉన్నాయని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పన్ను వసూళ్లలో ఉన్న లోపాలను సరిదిద్ది జీఎస్టీ వసూళ్లను పెంచే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది.
News February 2, 2026
విజయ్-రష్మిక పెళ్లి ఆ రోజే: TOI

విజయ్ దేవరకొండ-రష్మిక <<19017838>>పెళ్లి<<>> ఇవాళ అంటూ సోషల్ మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా(TOI) కథనం పేర్కొంది. అటు పెళ్లిపై రష్మిక గానీ విజయ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కాగా వీరిద్దరు ‘రణబాలి’ సినిమాలో నటిస్తున్నారు.


