News March 28, 2025
NLG: సంక్షోభంలో పౌల్ట్రీ రంగం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో బర్డ్‌ఫ్లూ.. పౌల్ట్రీ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది. ఇప్పటికే కొన్ని రోజులుగా కోళ్లు మృతి చెందుతుండడంతో పౌల్ట్రీ రైతులు ఆర్థికంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. బర్డ్‌ఫ్లూ కారణంగా 90 శాతం ప్రజలు చికెన్ తినడం మానేశారు. ఫలితంగా సదరు కోళ్ల కంపెనీ నిర్వాహకులు పౌల్ట్రీ రైతులకు కోడి పిల్లలు ఇవ్వడం పూర్తిగా మానేశారు. దీంతో వందలాది కోళ్ల ఫామ్ లకు తాళాలు పడ్డాయి.
Similar News
News April 2, 2025
నల్గొండ: ‘డీలర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు’

ప్రజా పంపిణీ వ్యవస్థలో డీలర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహశీల్దార్ మాచన రఘునందన్ హెచ్చరించారు. మంగళవారం నల్గొండలోని పలు రేషన్ దుకాణాలు, రైస్ మిల్లులను ఆయన తనిఖీ చేశారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు జరిగితే డీలర్షిప్ రద్దు చేస్తామన్నారు. డీలర్లు నియమ నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు ఉన్నాయన్నారు.
News April 1, 2025
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: వెంకట్ రెడ్డి

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కనగల్ మండలం జి.యడవల్లి గ్రామంలోని ఎన్.వి.కె ఫంక్షన్ హాల్ హాల్లో ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో ఐ.కె.పి సెంటర్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు.
News April 1, 2025
BREAKING: ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి కాన్వాయ్కి ప్రమాదం జరిగింది. గుర్రంపోడులో ఆలయ వార్షికోత్సవానికి వచ్చి వెళ్తుండాగా వద్దిరెడ్డిగూడెం వద్ద కాన్వాయ్‌లో గన్మెన్లు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో వాహనం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు తగలగా మంటలు చెలరేగాయి. ఇద్దరికి స్వల్ప గాయాలైనట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.