News March 28, 2025
చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ డాక్టర్ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఇదే కథల సంపుటిని షోలాపూర్‌కు చెందిన బుధవారం రేణుక ‘ఆనందం’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.
Similar News
News July 7, 2025
మచిలీపట్నం: స్పందనలో అర్జీలు స్వీకరించిన అధికారులు

మచిలీపట్నంలోని కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. డీఆర్ఓ చంద్రశేఖర్, ఆర్డీవో స్వాతి, తదితరులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
News July 7, 2025
ఘోర ప్రమాదం.. 8 మంది మృతి

పంజాబ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. హోషియార్‌పూర్‌లోని హాజీపూర్ రోడ్డులో బస్సు బోల్తా పడి 8 మంది మరణించారు. మరో 24 మంది గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు.
News July 7, 2025
ఆరెంజ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

TG: రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 11 వరకు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.