News March 28, 2025
సంగారెడ్డిలో మరో విషాదం..

SRD జిల్లాలో మరో విషాదం జరిగింది. కోహిర్ మండలం పైడిగుమ్మల్‌లోని వ్యవసాయ బావిలో పడి ఇద్దరు కార్మికులు మరణించారు. మృతులను UPకి చెందిన బైద్యనాథ్ భట్, ఒడిశావాసి హరిసింగ్‌గా గుర్తించారు. పైడిగుమ్మల్‌లోని వెంచర్‌లో పనిచేసేందుకు వీరిద్దరు వలస వచ్చారు. వీరు ఈనెల 10న అదృశ్యం కాగా 13న కోహిర్ PSలో కేసు నమోదైంది. గురువారం రాత్రి వ్యవసాయ బావిలో కార్మికుల మృతదేహాలను గుర్తించి వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.
Similar News
News January 20, 2026
కరీంనగర్: ప్రయోగశాలల సామగ్రికి టెండర్ల ఆహ్వానం

కరీంనగర్ జిల్లాలోని 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ప్రయోగ సామగ్రి పంపిణీ కోసం సీల్డ్ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు డీఐఈఓ వి.గంగాధర్ తెలిపారు. కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశానుసారం, ఫిబ్రవరి 2 నుంచి జరిగే ప్రయోగ పరీక్షల నిమిత్తం ఈ ప్రక్రియ చేపట్టారు. ఆసక్తి గల పంపిణీదారులు పద్మనగర్‌లోని డీఐఈఓ కార్యాలయంలో సంప్రదించి కొటేషన్లు సమర్పించాలన్నారు.
News January 20, 2026
బోరాబండలో దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

HYD బోరాబండలోని రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన భార్య రొడ్డె సరస్వతి (32)ని భర్త రొడ్డె ఆంజనేయులు రోకలి బండతో దాడి చేసి హతమార్చాడు. భార్య అక్రమ సంబంధం కొనసాగిస్తుందని ఆంజనేయులు అనుమానిస్తూ తరచూ గొడవ పడేవాడని సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
News January 20, 2026
చలికాలంలో జుట్టూడకుండా ఉండాలంటే..

మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలంలో జుట్టు సమస్యలు ఎక్కువ. కాబట్టి జుట్టు సంరక్షణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. తలస్నానానికి గోరువెచ్చటి నీటినే వాడాలి. తర్వాత కండీషనర్ మర్చిపోకూడదు. జుట్టు త్వరగా ఆరడానికి బ్లో డ్రైయ్యర్స్ వాడటం తగ్గించాలని సూచిస్తున్నారు. ఈ సీజన్లో వెంట్రుకలకు ఎంత తరచుగా ఆయిల్ పెడితే అంత మంచిది. తేమ శాతం నిలిచి జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుందంటున్నారు.


