News March 28, 2025

VJA: యువకుడిపై దాడి.. డబ్బుతో పరార్

image

ఓ ఆటోలో ఇద్దరు వ్యక్తులు కలిసి విజయవాడ బస్టాండ్ వద్దకు వచ్చి ఓ యువకుడితో అమ్మాయి ఉందని రేట్ ఫిక్స్ చేసుకున్నారు. ఈ మేరకు ఉండవల్లి సమీపంలో పొలాల వద్దకు వచ్చారు. అక్కడ యువకుడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారు. పని అయ్యాక విజయవాడలో వదిలిపెట్టాలని కోరాడు. దీంతో ఆటోకి రూ.1500ఇవ్వాలని యువకుడిపై దాడి చేసి, జేబులోని డబ్బు లాక్కెళ్లారు. యువకుడు ఫిర్యాదుకు వెళ్తే పోలీసులు మందలించి పంపారు.

Similar News

News October 31, 2025

కృష్ణా జిల్లాలో పలు మండలాలకు క్రీడా సామాగ్రి సరఫరా

image

కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ, పమిడిముక్కల, ఉయ్యూరు మండలాల క్లస్టర్ పాఠశాలలకు క్రీడా పరికరాలు సరఫరా చేయనున్నట్లు ఏపీ సమగ్ర శిక్ష అధికారులు కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్శులు రాంబాబు, అరుణ తెలిపారు. సంబంధిత మండలాల పీఈటీలు వారి క్లస్టర్‌కు కేటాయించిన స్పోర్ట్స్ మెటీరియల్‌ను స్వీకరించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

News October 30, 2025

కృష్ణా: ఉద్యాన పంటలపై మొంథా పంజా

image

మొంథా తుపాన్ ఉద్యాన పంటల రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అధికారుల ప్రాథమిక అంచనాల ప్రకారం.. జిల్లాలో 1416 హెక్టార్లలో ఉద్యాన పంటలు (అరటి, మొక్కజొన్న, పసుపు, చెరకు తదితరాలు) దెబ్బతిన్నాయి. ఈ పంటలపై ఆధారపడిన 2,229 మంది రైతులు రూ. 73.46 కోట్ల మేర నష్టపోయినట్టు అధికారులు ప్రాథమిక అంచనాలు తయారు చేశారు.

News October 30, 2025

కోడూరు: పవన్ పంట పొలాలను పరిశీలించే స్థలం ఇదే.?

image

తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. కోడూరు మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణాపురం ఆర్సీఎం చర్చి వద్ద తుపాన్ తాకిడికి నేలకి వోరిగిన వరిపైరును పరిశీలించనున్నారు. వ్యవసాయ అధికారులు తుపాన్ నష్టాన్ని అంచనా వేసి పవన్‌కి వివరించనున్నారు. పోలీస్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.