News March 28, 2025

HYD: అమ్మాయిలూ.. ఆటో ఎక్కుతున్నారా?

image

HYDలో అనేక మంది ఆటోలను బుక్ చేసుకోవడం, ప్యాసింజర్ ఆటోలో ప్రయాణించడం చేస్తుంటారు. వారి భద్రత కోసం పోలీసులు ‘మై ఆటో ఈజ్ సేఫ్’ పేరుతో ఆటో డ్రైవరు వివరాలతో పాటు QR కోడ్ ఉండేలా ఏర్పాటు చేశారు. ఆటోలో ఏదైనా మర్చిపోయినా, ఆటో డ్రైవర్ అసభ్యకరంగా ప్రవర్తించినా, ఆటోలోని క్యూఆర్ కోడ్ పోలీసులకు పంపిస్తే చాలు, వెంటనే చర్యలు చేపట్టి సహాయం చేస్తామని పోలీసులు తెలిపారు.

Similar News

News April 4, 2025

పాడేరు: ‘రూ.456 కోట్లతో రోడ్లు అభివృద్ధి పనులు’

image

అల్లూరి జిల్లాలో మారుమూల గ్రామాలకు రహదారులు నిర్మించి, డోలీ మోతల రహితంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తోందని జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేశ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం పాడేరులోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.456 కోట్లతో రహదారుల అభివృద్ధి, కొత్త రోడ్లు నిర్మాణాలు, 26 వంతెనల నిర్మాణాలను మంజూరు చేయడం జరిగిందని స్పష్టం చేసారు.

News April 4, 2025

టంగుటూరులో కారు ఢీకొని ఒకరి మృతి

image

టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో కారు ఢీ కొట్టడంతో గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి మృతి చెందాడు. సుమారు 40 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తిని కారు ఢీ కొనటంతో అతని తలకు బలమైన గాయాలై చనిపోయాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను పెట్రోలింగ్ పోలీసులు టంగుటూరు ఎస్సై‌కు సమాచారం అందించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 4, 2025

వక్ఫ్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం: కిషన్‌రెడ్డి

image

వక్ఫ్ సవరణ(UMEED) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వక్ఫ్ సంస్థల్లో మెరుగైన గవర్నెన్స్, పారదర్శకత, అవినీతి నిర్మూలనకు ఈ బిల్లు ఉపకరిస్తుందని ఉద్ఘాటించారు. ముస్లిం మహిళలకు, ఆ కమ్యూనిటీలోని పస్మాందాస్, అఘాఖానీస్‌‌కు లబ్ధి చేకూరుస్తుందని పేర్కొన్నారు. పీఎం మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

error: Content is protected !!