News March 28, 2025
KMR: పదో తరగతి పరీక్షలు.. గైర్హాజరు ఎంతంటే..?

కామారెడ్డి జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని DEO రాజు పేర్కొన్నారు. శుక్రవారం ఫిజికల్ సైన్స్ పరీక్ష జరగ్గా.. 12,579 విద్యార్థులకు 12,553 మంది పరీక్ష రాయగా, 26 మంది పరీక్షకు హాజరు కాలేదని ఆయన వివరించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 4, 2025
భక్తులు మెచ్చేలా ఏర్పాట్లను చేయాలి: మంత్రి తుమ్మల

రామయ్య కళ్యాణానికి వచ్చే భక్తులు మెచ్చే విధంగా తగిన ఏర్పాట్లను చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం ఆర్డిఓ కార్యాలయంలో నవమి ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే వెంకట్రావుపాల్గొన్నారు.
News April 4, 2025
కాసేపట్లో వర్షం..

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడుతున్నాయి. రాబోయే 2 గంటల్లో తూర్పు, దక్షిణ తెలంగాణల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ విశ్లేషకులు అంచనా వేశారు. హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
News April 4, 2025
ST సర్టిఫికెట్ జారీకి పేరెంట్స్ ఇద్దరూ ట్రైబల్స్ కానక్కర్లేదు: కలకత్తా HC

పేరెంట్స్లో ఒకరు ట్రైబల్ కాదనే కారణంతో పిల్లలకు ST సర్టిఫికెట్ నిరాకరించడం తగదని కలకత్తా హైకోర్టు పేర్కొంది. ఓ నీట్ అభ్యర్థి ST సర్టిఫికెట్ కోసం అప్లై చేశారు. తల్లి ట్రైబల్ కాగా తండ్రి ఫార్వర్డ్ కమ్యూనిటీ వ్యక్తని అధికారులు అర్జీని తిరస్కరించారు. దీనిపై అభ్యర్థి హైకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా కోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 24గంటల్లో సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది.