News March 28, 2025
శ్రీశైల మహా క్షేత్రంలో పుష్పాలతో అలంకరణ

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో వివిధ పుష్పాలతో అలంకరణ ఘనంగా చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర భక్తులు భారీ ఎత్తున శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ సందర్భంగా వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.
Similar News
News September 18, 2025
కడియం రాజీనామా చేయాలని పోస్ట్ కార్డు!

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ లింగాల ఘనపూర్‌కు చెందిన ఓ మహిళా ఓటరు పోస్ట్ కార్డ్ పంపారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచి, ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరినందుకు ఆమె నిరసన వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ, పార్టీ మారినందున పదవికి రాజీనామా చేయాలని ఆమె ఆ పోస్ట్‌కార్డులో కోరారు.
News September 18, 2025
మెదక్: వరద నష్టం అంచనాలు సిద్ధం: మంత్రి వివేక్

మెదక్ జిల్లాలో భారీ వర్షాలు వరదల వల్ల వివిధ శాఖల ద్వారా నష్టాన్ని అంచనాలు సిద్ధం చేసినట్లు మంత్రి డా.వివేక్ అన్నారు. మెదక్ జిల్లాలో వరద నష్టం శాశ్వత పనులకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అధికారులతో సమీక్షించారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేసి రవాణాలను పునరుద్ధరించినట్లు చెప్పారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, కలెక్టర్ రాహుల్ రాజ్ పాల్గొన్నారు.
News September 18, 2025
యాదాద్రి: 22 నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి కొండపై ఉన్న పర్వతవర్ధని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22 నుంచి వచ్చే నెల 2 వరకు దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ఎస్.వెంకట్రావు తెలిపారు. ఉత్సవాల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన చెప్పారు. భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు.