News March 25, 2024

మనవడితో CM రేవంత్ హోలీ (PHOTOS)

image

TG: సీఎం రేవంత్‌రెడ్డి తన మనవడితో హోలీ ఆడారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న తన నివాసంలో మనువడు రియాన్స్‌కు సీఎం రంగులు పూస్తూ సరదాగా గడిపారు. వారితో పాటు సీఎం రేవంత్ సతీమణి గీతారెడ్డి కూడా సంబరాల్లో పాల్గొన్నారు.

Similar News

News November 9, 2025

కొలికపూడిపై చర్యలు తీసుకోవాలి.. CBNకు పార్టీ క్రమశిక్షణ కమిటీ నివేదిక

image

AP: ఎంపీ చిన్నితో వివాదంలో తప్పంతా MLA కొలికపూడిదేనంటూ TDP క్రమశిక్షణ కమిటీ సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చింది. ఎన్నికైనప్పటి నుంచి పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంది. తన ఆరోపణలపై కొలికపూడి ఒక్క ఆధారం సమర్పించలేదని, సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలని సీఎంకు విన్నవించినట్లు సమాచారం. అయితే వారిద్దరినీ పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని కమిటీకి CBN చెప్పారు.

News November 9, 2025

పాడి పశువుల పాలలో కొవ్వు శాతం ఎందుకు తగ్గుతుంది?

image

గేదె, ఆవు పాలకు మంచి ధర రావాలంటే వాటిలో కొవ్వు శాతం కీలకం. పశువుల వయసు ఎక్కువగా ఉన్నప్పుడు, ఈత చివరి దశలో సాధారణంగానే పాలలో కొవ్వు శాతం తగ్గుతుంది. పశువులను మరీ ఎక్కువ దూరం నడిపించినా, అవి ఎదలో ఉన్నా, వ్యాధులకు గురైనా, మేతను మార్చినప్పుడు, పచ్చి, ఎండుగడ్డిని సమానంగా ఇవ్వకున్నా పాలలో వెన్నశాతం అనుకున్నంత రాదు.✍️ వెన్నశాతం పెంచే సూచనలకు <<-se_10015>>పాడిపంట <<>>క్లిక్ చేయండి.

News November 9, 2025

వాయుకాలుష్యంతో ఊబకాయ ప్రమాదం

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా వాయుకాలుష్యం మహిళల్లో ఊబకాయాన్ని కలిగిస్తుందని పలు పరిశోధనల్లో వెల్లడైంది. డయాబెటీస్ కేర్ జర్నల్‌ అధ్యయనంలో దీర్ఘకాలం వాయుకాలుష్యానికి గురయ్యే మహిళల్లో అధిక కొవ్వుశాతం, తక్కువ లీన్ మాస్‌ ఉంటుందని తేలింది. ఊబకాయాన్ని దూరంగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన ఆహారం, జీవనశైలితో పాటు కాలుష్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.