News March 28, 2025

వేడికి ఆగలేం.. కానీ చెట్లను బతకనీయం!

image

వేసవి వేడి మొదలైంది. బయటితో పోలిస్తే చెట్టు నీడలో ఉష్ణోగ్రత సగటున కనీసం 2 డిగ్రీలు తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ పల్లెటూళ్లలో సైతం ఇంటి ముందు ఖాళీ ఉంటే సిమెంట్‌తో అలికేస్తున్నాం తప్పితే చెట్లను ఎంతమంది పెంచుతున్నాం? ఆకులు రాలతాయనో, వేర్లు ఇంటిని కూల్చేస్తాయనో చాలామందిలో ఆందోళన. కనీసం ఖాళీ స్థలాల్లోనైనా వీలైనన్ని చెట్లు నాటితే భూతాపాన్ని తగ్గించినవారిమవుతాం. వృక్షో రక్షతి రక్షిత:

Similar News

News February 6, 2026

ఆఫీస్‌ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

image

TG: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల నుంచి డిమాండ్‌ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.

News February 6, 2026

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. హేజిల్‌వుడ్ దూరం

image

ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా T20 WC మొత్తానికి దూరమయ్యారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని క్రికెట్ AUS తెలిపింది. కాగా ఇప్పటికే కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, స్టార్క్ రిటైరయ్యారు. వీరు లేకుండానే AUS ఆడబోతోంది.
టీమ్: మార్ష్, బార్ట్‌లెట్, కొన్నోలీ, T డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, రెన్షా, స్టోయినిస్, జంపా. రిజర్వ్: అబాట్

News February 6, 2026

రేపటి నుంచే వాలెంటైన్స్ వీక్

image

ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే వాలెంటైన్స్ వీక్ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7న ‘రోజ్ డే’తో మొదలై వారం రోజుల పాటు ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే వంటి ప్రత్యేక రోజులతో ఈ వేడుకలు కొనసాగుతాయి. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేతో ఇవి ముగుస్తాయి. ఈ వీక్ అంతా ప్రేమికులు తమ మనసులోని ఇష్టాన్ని వ్యక్తపరచడానికి, గిఫ్టులు ఇచ్చిపుచ్చుకుంటూ ప్రేమను చాటుకుంటారు.