News March 28, 2025
సంగారెడ్డి: పదో తరగతి సైన్స్ పరీక్షకు 99.82% హాజరు

సంగారెడ్డి జిల్లాలోని 122 పరీక్ష కేంద్రాల్లో శుక్రవారం జరిగిన భౌతిక శాస్త్రం పదో తరగతి పబ్లిక్ పరీక్షకు 99.82% విద్యార్థులు హాజరయ్యారని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 22,411 మంది విద్యార్థులకు గానూ 22,370 మంది విద్యార్థులు హాజరయ్యారని, 41 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News April 2, 2025
మేడ్చల్: ఏప్రిల్ 3న వాహనాల వేలం

మేడ్చల్లో ఈ నెల 3న వివిధ కేసుల్లో పట్టుబడిన 6 వాహనాలను ఎక్సైజ్ సీఐ నవనీత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. సా.4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేలంలో ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని ఆమె చెప్పారు. వేలం ద్వారా వాహనాలను అందరూ చూసి, తన అభిరుచికి సరిపోయే వాహనాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరగాలని కోరుతూ ఆమె వాహనదారులను ఆహ్వానించారు.
News April 2, 2025
బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి: SP

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని భ్రమలో యువత, ప్రజలు విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని ఆన్నారు.
News April 2, 2025
జనగామ: సన్నం బియ్యం పంపిణీకి విస్తృత చర్యలు: కలెక్టర్

జనగామ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి విస్తృత చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రారంభించడంతో జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో MLA యశస్విని రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,264 రేషన్ కార్డులకు గాను నిత్యవసర దుకాణాల ద్వారా 3151.228 మెట్టు టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.