News March 28, 2025
బిల్ గేట్స్ నాతో మాట్లాడనన్నారు: CM చంద్రబాబు

AP: తాను కలుస్తానని మొదటిసారి కోరినప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఇష్టపడలేదని CM చంద్రబాబు ‘మద్రాస్ IIT’ ప్రసంగంలో తెలిపారు. ‘రాజకీయ నాయకులతో తనకు పని లేదని ఆయన అన్నారు. ఒప్పించి 45 నిమిషాలు మాట్లాడాను. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చాను. మనమంతా కృషి చేస్తే భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుంది. 2027 నాటికి మూడోస్థానం, 2047 నాటికి అగ్రదేశంగా అవతరిస్తుంది’ అని తెలిపారు.
Similar News
News April 2, 2025
టాప్-2లోకి దూసుకొచ్చిన PBKS

LSGపై ఘన విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో టాప్ 2లోకి దూసుకొచ్చింది. ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ కూడా బ్యాక్ టు బ్యాక్ విజయాలతో టాప్‌లో కొనసాగుతోంది. మూడో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. కాగా ఈ మూడు జట్లు ఇప్పటివరకూ కప్ కొట్టకపోవడం గమనార్హం. తర్వాతి స్థానాల్లో GT, MI, LSG, CSK, SRH, RR, KKR ఉన్నాయి.
News April 2, 2025
రిషభ్ పంత్‌కు పంజాబ్ కింగ్స్ కౌంటర్

మెగా వేలం సమయంలో తమ ఫ్రాంచైజీని అవమానించిన లక్నో కెప్టెన్ రిషభ్ పంత్‌పై PBKS కౌంటర్ ఇచ్చింది. రాత్రి LSGపై మ్యాచ్ గెలిచిన తర్వాత ‘మెగా వేలం టెన్షన్ దానంతటదే ముగిసింది’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. కాగా వేలం అనంతరం పంత్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘వేలంలో పంజాబ్ నన్ను ఎక్కడ కొంటుందో అని టెన్షన్ పడ్డా. శ్రేయస్ అయ్యర్‌ను దక్కించుకోవడంతో లక్నో టీమ్‌లో చేరగలనని భావించా’ అంటూ చెప్పుకొచ్చారు.
News April 2, 2025
నేడు ప్రకాశం జిల్లాకు అనంత్ అంబానీ

AP: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లి మండలంలోని దివాకరపురం సమీపంలో రూ.375 కోట్లతో నిర్మించనున్న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్‌కు ఆయన భూమిపూజ చేస్తారు. ఆయనతోపాటు మంత్రి లోకేశ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.