News March 28, 2025

వారంలో KBR పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్‌లకు టెండర్లు

image

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లను నిర్మించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.1,090 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. మెగా, ఎన్సీసీ, ఎంవీఆర్ సంస్థలు టెండరు దక్కించుకునేందుకు పోటీపడ్డాయి. ఇటీవల ఈ కంపెనీలు బిడ్లు దాఖలు చేశాయి. మరో వారం రోజుల్లో టెండర్ ఎవరికి కేటాయించాలనే విషయం స్పష్టత వస్తుంది. ఆ తర్వాతే ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News November 8, 2025

ASF: 571 కేసులు.. 38 మంది అరెస్ట్.. 40 వాహనాలు సీజ్

image

ఆసిఫాబాద్ జిల్లాలో గుడుంబా, దేశీదారు అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 571 గుడుంబా కేసులను నమోదు చేసి, 38 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఇందులో 40 వాహనాలను కూడా సీజ్ చేశారు. సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు, ప్రభావిత గ్రామాల్లో నిఘా పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

News November 8, 2025

ఏపీ న్యూస్ అప్డేట్స్

image

* సీఎం చంద్రబాబు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ ఎంపికపై సీనియర్ నేతలతో చర్చించారు.
* అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో శ్రీభక్త కనకదాసు జయంతి ఉత్సవాల్లో మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. తత్వవేత్తగా, స్వరకర్తగా సమాజ చైతన్యానికి ఆయన ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆదరణ పథకం కింద పేదలకు పనిముట్లు అందిస్తామని చెప్పారు.

News November 8, 2025

తానూరు: దాబాలో ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

image

తానూరు మండలం బామ్ని గ్రామానికి చెందిన బాశెట్టి రాజు(41) భోసి గ్రామ సమీపంలోని ఓ దాబాలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాశెట్టి రాజు కొద్ది రోజులుగా దాబాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం దాబాలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజు మద్యం మత్తులో ఉరేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.