News March 28, 2025

బాపట్లలో మానవత్వం చాటుకున్న మంత్రి

image

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మానవత్వం చాటుకున్నారు. బాపట్ల పరిధిలో శుక్రవారం ఓ ట్రాక్టర్ అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అదే సమయానికి అటుగా వస్తున్న మంత్రి దుర్గేష్ వెంటనే స్పందించారు. క్షతగాత్రులను వైద్యశాలకు తరలించారు. డాక్టర్లకు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టమేమీ జరగలేదని తెలిపారు.

Similar News

News April 2, 2025

మేడ్చల్: ఏప్రిల్ 3న వాహనాల వేలం

image

మేడ్చల్లో ఈ నెల 3న వివిధ కేసుల్లో పట్టుబడిన 6 వాహనాలను ఎక్సైజ్ సీఐ నవనీత బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. సా.4 గంటలకు ప్రారంభమయ్యే ఈ వేలంలో ఆసక్తి గలవారు పాల్గొనవచ్చని ఆమె చెప్పారు. వేలం ద్వారా వాహనాలను అందరూ చూసి, తన అభిరుచికి సరిపోయే వాహనాన్ని పొందేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ కార్యక్రమం సమర్థవంతంగా జరగాలని కోరుతూ ఆమె వాహనదారులను ఆహ్వానించారు.

News April 2, 2025

బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి: SP

image

యువత, విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, నిషేధిత ప్లే కార్డ్స్, గేమింగ్ యాప్‌లకు, IPL బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని మెదక్ ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తక్కువ సమయంలో సులభంగా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని భ్రమలో యువత, ప్రజలు విద్యార్థులు అక్రమ బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌లకు బానిసలుగా మారి, అప్పులపాలై ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్నారని ఆన్నారు.

News April 2, 2025

జనగామ: సన్నం బియ్యం పంపిణీకి విస్తృత చర్యలు: కలెక్టర్

image

జనగామ జిల్లాలో సన్నబియ్యం పంపిణీకి విస్తృత చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టి ప్రారంభించడంతో జిల్లాలో పాలకుర్తి నియోజకవర్గంలో MLA యశస్విని రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో 1,61,264 రేషన్ కార్డులకు గాను నిత్యవసర దుకాణాల ద్వారా 3151.228 మెట్టు టన్నుల సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

error: Content is protected !!