News March 25, 2024
ఉత్కంఠ రేపుతున్న మహిధర్ రెడ్డి మౌనం

YCP టిక్కెట్ చేజారిన నేపథ్యంలో కందుకూరు MLA మానుగుంట మహిధర్ రెడ్డి వ్యూహం ఏమిటన్నది ఉత్కంఠ రేపుతోంది. BJP.. లేదా TDP అభ్యర్ధిగా పోటీ చేసి YCPకి ఝలక్ ఇస్తారని అంతా భావించినప్పటికీ అలా జరగలేదు. ఇటు YCPకి మద్దతూ తెలపలేదు. MP అభ్యర్ధులుగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరూ మహీధర్ రెడ్డిని కలిసి మద్దతు కోరినప్పటికీ నిర్ణయం మాత్రం సస్పెన్స్‌గానే ఉంది.
Similar News
News December 24, 2025
ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చిన్నారులకు వైద్య పరీక్షలు

ప్రకాశం జిల్లాలో చిన్నారుల ఆరోగ్యానికి మరోసారి ఇచ్చేందుకు చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు బుధవారం సైతం జిల్లా వ్యాప్తంగా DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. 0 నుంచి 18 ఏళ్లలోపు విద్యార్థులు 404091 మంది ఉండగా, బాల్యంలో వ్యాధులు ఉన్నవారిగా 314 మందిగా అధికారులు గుర్తించారు.
News December 24, 2025
ప్రకాశం TDP పార్లమెంటరీ కమిటీ ఇదే.!

ప్రకాశం జిల్లా TDP పార్లమెంటరీ కమిటీని పార్టీ అధిష్టానం ప్రకటించింది. జిల్లా అధ్యక్షుడిగా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర, ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు, పార్లమెంటరీ వైస్ ప్రెసిడెంట్లుగా మల్లికార్జునరెడ్డి, కాశయ్య, వెంకటసుబ్బయ్య, శ్రీను, ఆరిఫా, సుబ్బారావు, రామయ్య చౌదరి, నాగరాజులు నియమితులయ్యారు. అలాగే పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా 9 మంది, స్పోక్ పర్సన్లుగా 9 మందితో ఇతర కార్యవర్గాన్ని ప్రకటించారు.
News December 24, 2025
తిరుమలకు ఫేక్ టికెట్లతో వస్తున్నారా..?

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనాల నేపథ్యంలో SP సుబ్బరాయుడు కీలక ప్రకటన చేశారు. ‘డిసెంబర్ 30, 31, జనవరి 1న లక్కీడిప్ టోకెన్లు ఉన్నవారినే దర్శనానికి అనుమతిస్తాం. అన్ని టోకెన్లను స్కాన్ చేసి అందులోని టైం ప్రకారమే పంపుతాం. నకిలీ టోకెన్లు సృష్టించిన వారిపై, వాటిని తిరుమలకు తీసుకొచ్చిన భక్తులపైనా కేసులు నమోదు చేస్తాం. ఆటో, జీపు డ్రైవర్లు భక్తులను మిస్ గైడ్ చేస్తే చర్యలు ఉంటాయి’ అని SP హెచ్చరించారు.


