News March 28, 2025
సిరిసిల్ల జిల్లాలో 14 మంది విద్యార్థులు గైర్హాజర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గురువారం జరిగిన పదోతరగతి పరీక్షలకు 14 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. జిల్లాలో మొత్తం 35 పరీక్ష కేంద్రాల్లో 6,767 మంది విద్యార్థులకు 6,750 విద్యార్థులు పరీక్ష రాశారు. 14 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేదని తెలిపారు.
Similar News
News October 21, 2025
మిమ్మల్ని చిత్తూరు ప్రజలు మరవలేరు..!

2020 నవంబర్ 8న సరిహద్దుల్లో ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఐరాల(M) రెడ్డివారిపల్లెకు చెందిన జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వీరమరణం పొందారు. 2007లో చిత్తూరులో CKబాబుపై జరిగిన హత్యాయత్నంలో గన్‌మెన్స్ హుస్సేన్ బాషా, సురేంద్ర అమరులయ్యారు. 2017లో పలమనేరు అడవుల్లో మహిళను అత్యాచారం చేయబోయారు. నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన కానిస్టేబుల్ జవహర్ నాయక్, హోంగార్డు దేవంద్ర చనిపోయారు.
#నేడు అమరవీరుల దినోత్సవం
News October 21, 2025
తిరుమలలో కొనసాగుతున్న రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అటు నిన్న 72,026 మంది స్వామి వారిని దర్శించుకున్నట్లు చెప్పారు. 23,304 మంది తలనీలాలు సమర్పించారన్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.86 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.
News October 21, 2025
శివోహం.. అనంతపురం జిల్లాలో దర్శనీయ శివాలయాలు

రేపటి నుంచి కార్తీకమాసం. ఈ నెలలో అనంతపురం జిల్లాలో దర్శనీయ ఆలయాలు ఎన్నో ఉన్నాయి.
★ తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి
★ కూడేరు జోడి లింగాల క్షేత్రం
★ పామిడి భోగేశ్వర స్వామి
★ లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం
★ అమరాపురం సిద్దేశ్వర స్వామి, కంబదూరు మల్లేశ్వర స్వామి
★ గార్లదిన్నె కోటంక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
★ బుక్కరాయసముద్రం కాశీ విశ్వనాథ క్షేత్రం
★ బత్తలపల్లిలో కాటి కోటేశ్వర స్వామి క్షేత్రం