News March 25, 2024
నందికొట్కూర్: టీడీపీలో చేరనున్న చెరుకుచెర్ల రాఘరామయ్య

నందికొట్కూరు నియోజకవర్గ సీనియర్ నాయకుడు చెరుకుచెర్ల రఘురామయ్య 29న చంద్రబాబు నంద్యాల జిల్లా పర్యటనలో భాగంగా టీడీపీలో చేరుతున్నట్లు తెలిపారు.
సోమవారం ఆయన నందికొట్కూరులో మాట్లాడుతూ.. వైసీపీలో కష్టపడి పార్టీ కోసం సేవ చేసే వారికి గుర్తింపు లేకపోవడం వల్ల రాజీనామా చేశానన్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయన ఇటీవలే పార్టీకి రాజీనామ చేశారు.
.
Similar News
News April 6, 2026
కర్నూలులో కాంట్రాక్ట్ బస్సులపై రవాణా శాఖ కొరడా

కర్నూలు జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించిన కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణా శాఖ కఠిన చర్యలు చేపట్టింది. మార్చి 26 నుంచి ఏప్రిల్ 5 వరకు 1178 బస్సులను తనిఖీ చేసి, 188 కేసులు నమోదు చేసినట్లు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ శాంతా కుమారి తెలిపారు. సరైన పత్రాలు లేని 6 బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని యాజమాన్యాలకు రూ.35.12 లక్షల జరిమానా విధించినట్లు ఆమె పేర్కొన్నారు.
News April 6, 2026
అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు: కలెక్టర్ సిరి

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి అర్జీని గడువులోగా పరిష్కరించాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో ప్రజల నుంచి ఆమె వినతి పత్రాలు స్వీకరించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం చూపాలని, ప్రజా సమస్యల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
News April 6, 2026
నీటి భద్రతపై 100 రోజుల కార్యాచరణ: కలెక్టర్

ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు జిల్లాలో ‘నీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమాన్ని అమలు చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. 100 రోజుల కార్యాచరణలో భాగంగా నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, చెరువుల పూడికతీత పనులు చేపట్టాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేలా అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పేర్కొన్నారు.


