News March 28, 2025

VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

image

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News July 9, 2025

HYD: BC బోనం పోస్టర్ ఆవిష్కరించిన చిరంజీవులు

image

42% బీసీ రిజర్వేషన్‌ను నోటిఫికేషన్‌తో వెంటనే అమలు చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నం, సుప్రీంకోర్టు 50% పరిమితి నిబంధనకు విరుద్ధమని BC ఇంటలెక్చువల్స్ ఫోరం ఛైర్మన్ (Retd IAS) చిరంజీవులు అన్నారు. OUలో BC బోనం పోస్టర్ ఆవిష్కరణలో భాగంగా కులగణన తర్వాత రిజర్వేషన్‌ను 68% పెంచితే పాట్నా హై కోర్టు కొట్టేసిన అనుభవం మన ముందుందని గుర్తు చేశారు.

News July 9, 2025

రామగుండంలో సింగరేణి త్రైపాక్షిక రక్షణ సమావేశం

image

రామగుండం బంగ్లాస్ ఏరియా గెస్ట్ హౌస్‌లో సింగరేణి 19వ ఏరియా లెవెల్ త్రైపాక్షిక రక్షణ సమావేశాన్ని ఈరోజు నిర్వహించారు. RG-1 GM లలిత్ కుమార్ పాల్గొని అధికారులు, వివిధ యూనియన్ల నాయకులతో చర్చించారు. రక్షణ, సంక్షేమం, సివిల్ ఆసుపత్రి తదితర విషయాలపై చర్చించారు. బొగ్గు గనులు, ఓపెన్ కాస్ట్‌లు ఉత్పత్తి తదితర విషయాలపై ప్రస్తావించారు. అధికారులు ఆంజనేయ ప్రసాద్, చిలుక శ్రీనివాస్, సాయి ప్రసాద్, కర్ణ పాల్గొన్నారు.

News July 9, 2025

ములుగు: గోదావరి పరివాహక ప్రాంతంలో చేపల వేట నిషేధం

image

జిల్లాలో భారీ వర్షపాతం నమోదైందని, గోదావరి పరివాహక ప్రాంతంలోని మత్స్యకారులు గోదావరిలో చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్మన్ రాజ్ తెలిపారు. చేపలు గుడ్లు పెట్టి పిల్లలు చేసే జులై, ఆగస్టు మాసంలో చేపల వేట నిషిద్ధమని తెలిపారు. చెరువులు మత్తడి పోస్తున్నప్పుడు మత్తడి ప్రాంతంలో సిమెంటు దిమ్మెలు, ఇనుప జాలీలు, కర్రలు, వలలు పెట్టడం వల్ల చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు