News March 28, 2025
2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

గురుగ్రామ్ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.
Similar News
News October 29, 2025
దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.
News October 29, 2025
గాజాపై దాడులు.. 60 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ దాడిలో 60 మంది పాలస్తీనియన్లు మరణించారు. వీరిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉన్నారని సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆదేశించడంతో సైన్యం 3చోట్ల బాంబుల వర్షం కురిపించింది. కాగా బందీల మృతదేహాల అప్పగింతకు ఉద్రిక్త పరిస్థితులు అడ్డంకిగా ఉన్నట్లు హమాస్ పేర్కొంది. హమాస్ ఇజ్రాయెల్ సైనికుడిని చంపడం వల్లే దాడి జరిగిందని, ఇది శాంతికి విఘాతం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
News October 29, 2025
కందిలో ఆకుగూడు పురుగు – నివారణకు సూచనలు

అధిక వర్షపాతం ఉన్న సమయంలో ఈ ఆకుగూడు పురుగు పంటను ఆశిస్తుంది. కంది పంట ఎదుగుదల దశలో ఎక్కువగా, ఒక్కోసారి పూత దశలో కూడా ఆశిస్తుంది. లార్వాలు చిగురాకులను, ఆకులను గూడుగా చేసి లోపల ఉండి ఆకులను, పువ్వులను, లేత కాయలను కూడా తొలిచి తింటాయి. ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో క్వినాల్ఫాస్ 25% ఇ.సి. 2.0 మి.లీ. (లేదా) మోనోక్రోటోఫాస్ 36% యస్.యల్ 1.6 మి.లీ. కలిపి పంటపై పిచికారీ చేయాలి.


