News March 28, 2025

ఎన్టీఆర్: రైలు ప్రయాణికులకు శుభవార్త 

image

విజయవాడ మీదుగా హైదరాబాద్(HYB)-కటక్(CTC) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.07165 HYB-CTC రైలును ఏప్రిల్ 1 నుంచి జూన్ 24 వరకు ప్రతి మంగళవారం, నం.07166 CTC-HYB మధ్య నడిచే రైలును ఏప్రిల్ 2 నుంచి జూన్ 25 వరకు ప్రతి బుధవారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడతో పాటు అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు. 

Similar News

News July 6, 2025

రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద ప్రేక్షకుల ఆందోళన

image

వరంగల్ రామ్ లక్ష్మణ్ థియేటర్ వద్ద సినిమాకు వచ్చిన ప్రేక్షకులు ఆందోళన చేపట్టారు. ఆదివారం మధ్యాహ్నం 2.45 గంటలకు జురాసిక్ వరల్డ్ 3D సినిమా నడుస్తున్న క్రమంలో, త్రీడీ బొమ్మ కనిపించకపోవడంపై ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. టికెట్ కౌంటర్ వద్దకు వెళ్లి ఆందోళన చేపట్టారు. థియేటర్ యాజమాన్యం సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ప్రేక్షకులు ఆగ్రహించారు. షో నిలిపి వేసి టికెట్ డబ్బులు ఇచ్చి పంపించారు.

News July 6, 2025

పెద్దమందడిలో 12.8 మి.మీ వర్షపాతం

image

జిల్లాలో గత 24 గంటల్లో (నిన్న ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30 వరకు) పెద్దమందడిలో అత్యధికంగా 12.8 మి.మీ వర్షం కురిసింది. అమరచింత 10.2 మదనాపూర్ 6.2 ఘనపూర్ 1.4 గోపాల్పేట్ 1.6 రేవల్లి 7.6 పానగల్ 4.4 వనపర్తి 1.2 కొత్తకోట 2.6 ఆత్మకూరు 1.6 శ్రీరంగాపూర్ 3.0 వీపనగండ్ల 2.8 చిన్నంబావి లలో 1.8 మి.మీ వర్షపాతం, పెబ్బేర్‌లో ‘0’మి.మీ వర్షపాతం నమోదయినట్లు జిల్లా సీపీఓ తన నివేదికలో పేర్కొన్నారు.

News July 6, 2025

జగిత్యాల: ముఖ్యమంత్రికి లేఖ రాసిన మాజీ మంత్రి

image

రాష్ట్ర మత్స్యకారులకు చేపల విత్తనం పంపిణీకి బదులుగా.. వాటి విలువ నగదు రూపేనా కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మాజీమంత్రి జీవన్ రెడ్డి ఆదివారం లేఖ రాశారు. రాష్ట్రంలో చేపల విత్తనాలను స్వయంగా సమకూర్చుకునే వసతి లేనందున పక్క రాష్ట్రం ద్వారా ఎగుమతి చేయడంతో సమయం వృథా అవుతుందని, మత్స్యకారులు నష్టపోతున్నారని తెలిపారు. చేపల పెంపకంలో ఎంతో అనుభవం కలిగిన మత్స్యకారులకు నేరుగా నగదు చెల్లించాలని కోరారు.