News March 28, 2025

SLM: పక్షుల రక్షణకు విద్యార్థుల వినూత్న ఆలోచన

image

పక్షుల రక్షణకు విద్యార్థులు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలంలోని బూరగాం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల, గ్రామాలలో పక్షుల కోసం ప్రత్యేకంగా తొట్టెలు, కొబ్బరి చిప్పల్లో నీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఎండకు స్పృహ తప్పి పడిపోయిన పక్షికి విద్యార్థులు నీరు తాగించి రక్షించారు. దీంతో పాఠశాల విద్యార్థులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

Similar News

News April 2, 2025

సోంపేట: రైలు ఢీకొని గుర్తు తెలియని మహిళ మ‌ృతి

image

శ్రీకాకుళం జిల్లా సోంపేట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ డి హరినాథ్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఓ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగనట్లు ఆయన చెప్పారు. ఆమె వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందన్నారు. వివరాలు తెలిస్తే ఈ నంబర్‌ను 9989136143 సంప్రదించాలని ఆయన చెప్పారు.

News April 2, 2025

మత్స్యకార కుటుంబాలకు అండగా ఉంటాం: అచ్చెన్న

image

వేటకెళ్లి మృతి చెందిన కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వేటకెళ్లిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, మత్స్య శాఖల నుంచి వేరువేరుగా రూ.5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. చెరో రూ. పది లక్షలను ఆ కుటుంబాలకు త్వరలో అందజేస్తామన్నారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

News April 2, 2025

వజ్రపుకొత్తూరు: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మత్స్యకారుల మృతదేహాలు

image

సముద్రంలో గల్లంతైన వజ్రపుకొత్తూరు(M) మంచినీళ్లుపేట గ్రామానికి చెందిన మత్స్యకారుల మృతదేహాలు బుధవారం ఉదయం అక్కుపల్లి, డోకులపాడు బీచ్‌ల వద్ద ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. ఏప్రిల్ 1వ తేదీన నలుగురు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లగా బోటు తిరగబడి ప్రమాదం జరిగింది. ఇందులో ఇద్దరు మత్స్యకారులు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకోగా.. బుంగ ధనరాజు, వంక కృష్ణా గల్లంతై మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

error: Content is protected !!