News March 28, 2025
మొగుళ్లపల్లి: ‘పది’ పరీక్షా కేంద్రాల తనిఖీ

మొగుళ్లపల్లి మండల కేంద్రంతో పాటు మొట్లపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను డీఈవో రాజేందర్ తనిఖీ చేసినట్లు ఎంఈఓ కుమారస్వామి తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కాన్ఫరెన్స్లో పాల్గొని జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల సీఎస్ (చీఫ్ సూపరింటెండెంట్), డీఓ(డిపార్ట్మెంటల్ ఆఫీసర్)లతో మాట్లాడారు. అనంతరం ముల్కలపల్లి పాఠశాలను తనిఖీ చేసి పలు సూచనలు చేశారు.
Similar News
News April 2, 2025
తిరుపతి: ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ కేంద్రం

కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో డ్రైవింగ్ శిక్షణ సంస్థ నెలకొల్పేందుకు అనుమతులు ఇస్తున్నామని తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కొర్రపాటి మురళీమోహన్ తెలిపారు. తిరుపతిలోని ఆర్టీవో కార్యాలయంలో లైట్ మోటార్ వాహనాలు, హెవీ మోటర్ వాహనాల డ్రైవింగ్ స్కూల్ యాజమాన్యాలతో ఆయన సమావేశం నిర్వహించారు. తిరుపతిలో లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఈ శిక్షణ సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు.
News April 2, 2025
IPL: హ్యాట్రిక్‌పై కన్నేసిన RCB

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.
News April 2, 2025
ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

సమ్మర్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.