News March 28, 2025
బ్లాక్ స్పాట్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్, ఎస్పీ

అనంతపురం జిల్లాలో 37 బ్లాక్ స్పాట్లను గుర్తించగా.. ఆయా బ్లాక్ స్పాట్లలో రెండు వారాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. వారు మాట్లాడుతూ.. రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ప్రతినెల రోడ్డు భద్రతలో భాగంగా వితౌట్ హెల్మెట్‌తో ప్రయాణించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News April 6, 2025
ప్రజా సమస్యలపై వినతులు స్వీకరిస్తాం: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 7న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తామని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ప్రజా సమస్యలపై ఉ.9 గంటల నుంచి మ.1గంట వరకు వినతులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొంటారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News April 6, 2025
గుత్తి: యువకుడిపై దూసుకెళ్లిన ట్రాక్టర్

గుత్తి మండలం చెర్లోపల్లి గ్రామ సమీపంలో పండగ రోజు ఆదివారం విషాదం చోటుచేసుకుంది. పెద్దొడ్డి గ్రామానికి చెందిన విజయ్ (18) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడటంతో మృతి చెందాడు. రాళ్లు తీసుకురావడానికి కూలీలతో కలిసి వెళ్లాడు. రాళ్లు వేస్తున్న సమయంలో కింద నిలుచొని ఉన్న విజయ్‌పై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 6, 2025
నంచర్ల- గుంతకల్లు మధ్య రైల్వే డబుల్ లైన్

అనంత జిల్లా గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి కర్నూలు నంచర్ల మధ్య డబుల్ లైన్ నిర్మాణానికి రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. గుంతకల్లు రైల్వే జంక్షన్ మల్లప్పగేట్ నుంచి KNL చిప్పగిరి, దౌలతాపురం, నంచర్ల మధ్య ఈ ఆర్‌వో డబుల్ లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. ఇందుకోసం రైతుల నుంచి భూసేకరణ చేయనున్నారు. పత్తికొండ ఆర్టీవో పర్యవేక్షణలో భూసేకరణ చేపడుతున్నట్లు రైల్వే అధికారులు నోటీసులో పేర్కొన్నారు.