News March 28, 2025

31న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్

image

కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న ‘అర్జున్ S/O వైజయంతి’ ఫస్ట్ సింగిల్‌ను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ‘నాయాల్ది’ అంటూ సాగే ఈ పాట పోస్టర్‌ను SMలో షేర్ చేశారు. ఈ చిత్రంలో కళ్యాణ్ తల్లిగా, పోలీస్ ఆఫీసర్‌గా విజయశాంతి కీలకపాత్ర పోషిస్తుండగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అజనీశ్ లోక్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

Similar News

News April 3, 2025

హను రాఘవపూడితో ప్రభాస్ మరో సినిమా?

image

ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో ఫౌజీ(వర్కింగ్ టైటిల్) అనే సినిమా తెరకెక్కుతోందన్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో హను డైరెక్షన్‌ పట్ల ముగ్ధుడైన ప్రభాస్ ఆయనకు మళ్లీ ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చారని, కథ రెడీ చేసుకోవాలని సూచించారని సమాచారం. అయితే ఇది తెరకెక్కేందుకు చాలా కాలం పడుతుందని సినీవర్గాలంటున్నాయి. డార్లింగ్ ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2, ప్రశాంత్ వర్మతో సినిమా చేస్తున్నారు.

News April 3, 2025

పాయింట్స్ టేబుల్ టాప్‌లో పంజాబ్ కింగ్స్

image

ఐపీఎల్ 2025లో రెండు వరుస విజయాలు సాధించి పాయింట్ల పట్టికల పంజాబ్ కింగ్స్ టాప్‌లో నిలిచింది. ఢిల్లీ కూడా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమి ఎరగకుండా రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ఆర్సీబీ.. గుజరాత్‌పై ఓటమితో మూడో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాత GT, MI, LSG, CSK, SRH, RR, KKR కొనసాగుతున్నాయి. ఇవాళ జరిగే SRH vs KKR మ్యాచ్ తర్వాత సమీకరణాలు మారే ఛాన్స్ ఉంది.

News April 3, 2025

ముస్లింలను అణచివేసేందుకే వక్ఫ్ బిల్లు: రాహుల్

image

దేశంలోని ముస్లింలను అణచివేసి, వారి ఆస్తి హక్కులను హరించేందుకు వక్ఫ్ బిల్లును ఓ ఆయుధంగా వాడుకుంటున్నారని ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘ముస్లింలను లక్ష్యంగా చేసుకునే వక్ఫ్ బిల్లు తీసుకొచ్చారు. భవిష్యత్‌లో దీనిని ఇతర వర్గాలపై కూడా ప్రయోగించవచ్చు. ఈ బిల్లు ఆర్టికల్ 25ను ఉల్లంఘిస్తుంది. ఇది దేశ ఆలోచనలపై దాడి చేస్తుంది’ అని ఆయన ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేశారు.

error: Content is protected !!