News March 28, 2025
ADB: ప్రతి పోలీస్ స్టేషన్లో రిసెప్షన్ల పాత్ర కీలకమైంది: ఎస్పీ

ప్రతి పోలీస్ స్టేషన్ నందు రిసెప్షన్ సెంటర్ల పాత్ర కీలకంగా వ్యవహరిస్తుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న రిసెప్షనిస్టూలతో సమావేశం ఏర్పాటు చేసి, సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం ఏర్పాటు చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా కృషి చేయాలన్నారు.
Similar News
News April 2, 2025
ADB కలెక్టర్‌కు అవార్డ్.. సిబ్బందికి సన్మానం

ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షిషా వైవిధ్య ఆలోచన రూపమైన ఆరోగ్య పాఠశాల ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి అవార్డు వచ్చేలా పనిచేసిన బృందాన్ని కలెక్టర్ మంగళవారం సన్మానించారు. ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరంలోనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వారిని కోరారు.
News April 2, 2025
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది వీలైనంత త్వరగా ఘటన స్థలాలకు చేరుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ అన్నారు. తమ పరిధిలో పెట్రోలింగ్, గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. బ్లూ కోర్ట్&డయల్ 100 సిబ్బంది, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అదేవిధంగా పాత నేరస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. డయల్ 100కి ఫోన్ చేసే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.
News April 1, 2025
GDH: రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

గుడిహత్నూర్ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీతాగొంది జాతీయ రహదారిపై వాటర్ ట్యాంక్‌తో డివైడర్ల మధ్యలోని మొక్కలకు NHAI సిబ్బంది నీరు పడుతున్నారు. గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న ఓ లారీ ట్యాంకర్‌ను ఢీకొంది. లారీ డ్రైవర్ మహమ్మద్ జలీంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని రిమ్స్‌కు తరలించారు.