News March 28, 2025

నాగోల్: స్కైవాక్ నిర్మాణాలపై సంస్థల ఆసక్తి..!

image

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం కొన్ని సంస్థలు స్థానిక నాగోల్, ఉప్పల్ స్టేడియం, దుర్గం చెరువు, కూకట్పల్లి తదితర మెట్రో స్టేషన్ల నుంచి స్కైవాక్ నిర్మించేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు L&T తెలిపింది. మెట్రో నుంచి స్కై వాక్ నిర్మాణాలకు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదింపులు జరుగుతున్నాయి.

Similar News

News April 2, 2025

శ్రేయస్ అయ్యర్ సరికొత్త ఘనత

image

ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మరో ఘనత సాధించారు. టోర్నీలో అత్యధిక విన్ పర్సంటేజీ సాధించిన మూడో కెప్టెన్‌గా అయ్యర్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 72 మ్యాచులకు సారథ్యం వహించి 55.55% విజయాలు సాధించారు. ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (55.06%) రికార్డును ఆయన అధిగమించారు. ఈ జాబితాలో ధోనీ (58.84%) అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత సచిన్ (58.82%) కొనసాగుతున్నారు.

News April 2, 2025

తలంబ్రాల బుకింగ్‌లో ఉమ్మడి కరీంనగర్ రికార్డు

image

రాములవారి కళ్యాణ తలంబ్రాల బుకింగ్‌లో KNR రీజియన్ దూసుకుపోతోందని ఆర్టీసీ లాజిస్టిక్స్ ఏటీఎం రామారావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 6000 రాములోరి కళ్యాణ ముత్యాల తలంబ్రాలు బుకింగ్ అయినట్లు తెలిపారు. సీతారాముల వారి కళ్యాణానికి వెళ్లలేని భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ కార్గో ద్వారా సీతారాముల కళ్యాణ తలంబ్రాలను ఇంటి వద్దకే పంపించే ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!