News March 28, 2025

నిర్మ‌లా సీతారామ‌న్‌ను కలిసిన మంత్రి సత్య కుమార్

image

రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి సత్య కుమార్ యాదవ్ జాతీయ ఆరోగ్య మిష‌న్, ఇత‌ర ప‌థ‌కాల కింద రాష్ట్రానికి అద‌నంగా రూ.259 కోట్లు కేటాయించాల‌ని కోరారు. NHM రాష్ట్రానికి రూ.109 కోట్లు, ప‌ర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మ‌రో రూ.150 కోట్లు విడుద‌ల చేయాల‌ని కోరారు.

Similar News

News December 4, 2025

నెల్లూరులో 5,198 మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌ నమోదు..!

image

లోక్ సభలో నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి AP, నెల్లూరులో SHG కింద ఉన్న మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌‌పై ప్రశ్నించారు. MSME పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సుశ్రీ శోభా కరండ్లాజే మాట్లాడుతూ.. MSME పరిశ్రమల రిజిస్ట్రేషన్‌‌కు ఉద్యమ్‌ రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను 1జులై2020న ప్రారంభించామన్నారు. అప్పటి నుంచి మైక్రో ఎంటర్‌ ప్రైజెస్‌ 30 నవంబర్ 2025 నాటికి APలో SHGల తరఫున 1,30,171, నెల్లూరులో 5,198 నమోదయ్యాయన్నారు.

News December 4, 2025

గజ్వేల్: ‘అట్రాసిటీ కేసుల పట్ల నిర్లక్ష్యం వీడాలి’

image

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పట్ల పోలీస్, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వీడాలని దళిత బహుజన ఫ్రంట్(డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి. శంకర్ డిమాండ్‌ చేశారు. గజ్వేల్ అంబేద్కర్ భవన్‌లో ఎస్సీ, ఎస్టీ అత్యాచార బాధితుల, సాక్షుల సమావేశం నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. బాధితులకు తక్షణ న్యాయం అందించాలని కోరారు.

News December 4, 2025

గోల్డ్ లోన్? పర్సనల్ లోన్? ఏది బెటర్

image

మీ దగ్గర బంగారం ఉంటే గోల్డ్ లోన్ తీసుకోవడం గుడ్ ఛాయిస్. అత్యవసరంగా డబ్బులు అవసరమైతే బంగారం తాకట్టు పెట్టి బ్యాంకులో లోన్ తీసుకోవచ్చు. తనఖా పెట్టిన కొద్దిసేపటికే డబ్బులు అకౌంట్‌లో డిపాజిట్ అవుతాయి. నెల నెలా వడ్డీ కట్టే సమస్య ఉండదు. సంవత్సరం చివరిలో లేదంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు చెల్లించి మీ బంగారం వెనక్కి తీసుకోవచ్చు. పర్సనల్ లోన్ EMI చెల్లింపు మిస్ అయితే వడ్డీ ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది.