News March 25, 2024

ఆస్ట్రేలియాతో భారత్ ఐదు టెస్టుల సిరీస్

image

ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ప్రతిష్ఠాత్మకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది చివర్లో జరిగే సిరీస్‌లో మార్పు చోటు చేసుకోనుంది. ఐదు టెస్టుల సిరీస్‌గా దీనిని నిర్వహించనున్నట్లు ఆస్ట్రేలియా బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఎక్కువగా 4 టెస్టుల సిరీస్‌ను నిర్వహించారు. 32 ఏళ్ల తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరగనుంది. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించనున్నారు.

Similar News

News October 3, 2024

తెలుగువారి కోసం Google కొత్త ఫీచర్

image

Gemini Live AI టూల్‌తో మరికొన్ని రోజుల్లో తెలుగులో కూడా సంభాషించవచ్చు. దేశంలో వాయిస్ అసిస్టెంట్ ఏఐ టూల్ వాడ‌కం పెరుగుతుండ‌డంతో Google దీన్ని మరిన్ని ప్రాంతీయ భాష‌లకు విస్తరించింది. ప్రస్తుతం ఇంగ్లిష్‌తోపాటు హిందీని కూడా ప్రవేశపెట్టింది. అలాగే మరికొన్ని రోజుల్లో తెలుగు, త‌మిళం, మ‌లయాళం, బెంగాలీ, మ‌రాఠీ, ఉర్దూ భాషల్లో తీసుకురానుంది. ఈ ఏడాదితో దేశంలో Google 20 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది.

News October 3, 2024

సురేఖ‌పై పరువు నష్టం దావా వేసిన నాగార్జున

image

నటి సమంత విడాకులు తీసుకోవడంలో తన ప్రమేయం ఉందంటూ మంత్రి కొండా సురేఖ చేసిన కామెంట్స్‌పై నాగార్జున కోర్టుకు వెళ్లారు. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మంత్రి తన కుటుంబసభ్యుల పరువుకు భంగం కలిగించారని, ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని దావాలో పేర్కొన్నారు.

News October 3, 2024

రేడియోలతో గిన్నిస్ వరల్డ్ రికార్డు

image

యూపీలోని గజ్రౌలాకు చెందిన రామ్ సింగ్ 1,257 యూనిక్ రేడియోలను కలిగి ఉండి గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కారు. ఇవి 1920 నుంచి 2010 మధ్య కాలంలోనివని ఆయన తెలిపారు. రామ్ సింగ్ వద్ద మొత్తం 1,400 రేడియోలు ఉండగా వీటిలో 1,257 ప్రత్యేకమైనవని గుర్తించారు. వీటిని ఢిల్లీ, మీరట్‌లో కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. భవిష్యత్తు తరాలకు రేడియో గురించి తెలియజేసేందుకు వీటిని సేకరించినట్లు రామ్ సింగ్ పేర్కొన్నారు.