News March 28, 2025
‘ఎల్2: ఎంపురాన్’పై విమర్శలు!

మోహన్‌లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. అయితే, సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఓ గ్రూప్ ఆడియన్స్‌ను ఇబ్బంది పెట్టాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ సహా మరికొన్ని సన్నివేశాలు కావాలనే చేసినట్టు ఉన్నాయని విమర్శలు చేస్తున్నారు. మతపరమైన వాటిలో తప్పుగా చూపించారని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో డైరెక్టర్ పృథ్వీరాజ్‌పై తీవ్ర విమర్శలొస్తున్నాయి.
Similar News
News April 2, 2025
చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్‌ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్‌ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.
News April 2, 2025
రాష్ట్రంలోనే క్లీన్ ఎయిర్ సిటీగా కడప

AP: రాష్ట్రంలో అత్యంత తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప నిలిచినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక్కడ 10 పీఎం స్థాయిలో 42 పాయింట్లు ఉన్నట్లు వెల్లడించింది. ఆ తర్వాత 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో ఉండగా కర్నూలు, ఒంగోలు (56 ) మూడో స్థానంలో నిలిచాయి. అత్యంత కాలుష్య నగరంగా విశాఖపట్నం (120) నిలిచింది. అమరావతిలో ఎలాంటి పరిశ్రమలు, నిర్మాణాలు లేకపోయినా కాలుష్యం 71 పాయింట్లుగా నమోదైంది.
News April 2, 2025
IPL: హ్యాట్రిక్‌పై కన్నేసిన RCB

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.