News March 28, 2025

జగిత్యాల: మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రి పదవి ఇవ్వాలి

image

త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మాదిగలకు మంత్రిపదవి ఇవ్వాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్, దుమాల గంగారాం డిమాండ్ చేశారు. శుక్రవారం జగిత్యాల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో జగిత్యాల జిల్లా నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు మంత్రి పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Similar News

News January 14, 2026

పాలక్ పనీర్ తంటా: ఇండియన్ స్టూడెంట్స్‌కు ₹1.80 కోట్ల పరిహారం

image

USలోని కొలరాడో వర్సిటీలో వివక్షకు గురైన ఇండియన్ Ph.D విద్యార్థులు ఆదిత్య ప్రకాష్, ఊర్మి భట్టాచార్య న్యాయపోరాటంలో నెగ్గారు. క్యాంపస్‌లో 2023లో పాలక్ పనీర్ వేడి చేస్తున్న టైమ్‌లో సిబ్బంది ఆ వాసనపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వివాదం ముదిరి వారి డిగ్రీలను నిలిపివేసే వరకు వెళ్లడంతో కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా వర్సిటీ వారికి దాదాపు ₹1.80 కోట్ల పరిహారం చెల్లించడంతో పాటు మాస్టర్స్ డిగ్రీలను అందజేసింది.

News January 14, 2026

వేరుశనగలో దిగుబడి పెరగాలంటే!

image

వేరుశనగలో పంట నాణ్యత, దిగుబడి పెరగడానికి జింక్ చాలా కీలకం. ఈ సూక్ష్మపోషకం తగ్గినప్పుడు మొక్కలో ఎదుగుదల ఉండదు. ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలకు ఇరువైపులా తుప్పురంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లక్షణాలు కనిపించగానే లీటరు నీటికి 2 గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని వారం వ్యవధిలో 2-3సార్లు పిచికారీ చేయాలి. ఎకరాకు 20 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్‌ను 3 పంటలకొకసారి ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

News January 14, 2026

ఏలూరులో సంక్రాంతి వేడుకల్లో ఎడ్ల బండిపై ఎస్పీ దంపతులు

image

ఏలూరులో పోలీసు ప్రధాన కార్యాలయ ఆవరణలో సంక్రాంతి సంబరాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ప్రతాప శివ కిషోర్, ఆయన సతీమణి ధాత్రి రెడ్డి (రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవో) దంపతులు సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి, చిన్నారులకు భోగి పళ్లు పోశారు. అనంతరం పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఎడ్లబండిపై విహరించి అందరినీ అలరించారు. ఈ వేడుకల్లో పోలీసు కుటుంబాలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.