News March 29, 2025
పుట్టపర్తిలో సినీ నటుడు సాయికుమార్ సందడి

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శుక్రవారం సినీ నటుడు సాయికుమార్ సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ ఆర్. జె. రత్నాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సత్యసాయి సమాధి దర్శనార్థం పుట్టపర్తికి వచ్చినట్లు తెలిపారు. మానవాళికి ఉచిత విద్య, వైద్యంతో పాటు తాగునీరు అందిస్తున్న ఘనత సత్యసాయి ట్రస్ట్‌కే దక్కుతుందన్నారు. మనమందరం సత్యసాయి బాటలో ప్రజలకు సేవలు చేయాలన్నారు.
Similar News
News September 18, 2025
తల్లిదండ్రులకు సత్వర న్యాయం చేయాలి: జగిత్యాల కలెక్టర్

జగిత్యాల కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో దివ్యాంగుల & వయోవృద్ధుల జిల్లా కమిటీ సమావేశం గురువారం ఏర్పాటు చేశారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. తల్లిదండ్రులను విస్మరించే కుమారులు, కోడళ్లు, వారసులకు సీనియర్ సిటిజన్స్ కమిటీ ప్రతినిధులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తూ వారిలో చైతన్యం కల్పించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చే వృద్ధులైన తల్లిదండ్రుల పట్ల స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలన్నారు.
News September 18, 2025
అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకోవాలి: కలెక్టర్

గర్భిణులు, బాలింతలు ప్రభుత్వం అందించే పౌష్టికాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భుజించాలని కలెక్టర్ స్నేహ శబరీష్ స్పష్టం చేశారు. ఆమె తన ఛాంబర్‌లో ఎనిమిదవ రాష్ట్రీయ పోషణ మాసం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ మాసంలో కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం నిర్వహించాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
News September 18, 2025
VZM: ‘యూరియా కొరతపై సోషల్ మీడియాలో అసత్య వార్తలు’

విజయనగరం జిల్లాలో యూరియా కొరత లేదని కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి గురువారం తెలిపారు. సోషల్ మీడియాలో కొంతమంది రైతులను తప్పుదారి పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అటువంటి వార్తలు పూర్తిగా అసత్యమని ఆయన స్పష్టం చేశారు. యూరియాను ఇప్పటివరకు 30,395 మెట్రిక్ టన్నులు, 11,426 మెట్రిక్ టన్నులు డి.ఏ.పి, 9379 మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉంచామన్నారు.