News March 29, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,63,699 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,08,012, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,880, అన్నదానానికి రూ.10,807 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.
Similar News
News November 7, 2025
వరంగల్ సీపీ కార్యాలయంలో వందేమాతరం గేయాలాపన

వందేమాతరం జాతీయ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో అధికారులు సిబ్బంది వందే మాతరం గేయాలాపన చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్‌తో పాటు ఏఓ, ఏసీపీలు, ఆర్ఎస్ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఇతర పరిపాలన, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News November 7, 2025
ఇంకొల్లు: సినీ ఫక్కీలో దొంగతనం

సినీ ఫక్కీలో దొంగతనం జరిగిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన చిలంకూరి కాంతయ్య బంగారు నగలు విడిపించుకునేందుకు రూ.3.90 లక్షలతో బ్యాంకుకు వెళ్లాడు. వడ్డీ కింద మరో 10 వేల కోసం ఇంటికి బయలుదేరగా దుండగులు బైక్‌పై వచ్చి రూ.200ల నోటు కింద పడేశారు. కాంతయ్యను మభ్యపెట్టి, సైకిల్‌పై ఉన్న నగదుతో పారిపోయారు. ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 7, 2025
ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

ONGCలో 2,623 అప్రెంటిస్ ఖాళీలకు అప్లై చేయడానికి దరఖాస్తు గడువును పొడిగించారు. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో డెడ్‌లైన్ ముగియగా ఈనెల 17 వరకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పోస్టును బట్టి టెన్త్, డిప్లొమా, ఐటీఐ, డిగ్రీ పాసై, 18-24 ఏళ్లు ఉన్నవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి వయసులో సడలింపు ఉంటుంది. అభ్యర్థులను విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు కోసం <


