News March 29, 2025
KMR: బీసీ విద్యార్థులకు ఉచిత శిక్షణ

HYD స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో BC విద్యార్థులకు నెల పాటు నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారిని బి.స్రవంతి శుక్రవారం తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రైవేటు బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారని పేర్కొన్నారు. డిగ్రీ పూర్తి చేసి 26 సంవత్సరాల లోపు ఉన్న వారు అర్హులని ఆమె తెలిపారు.
Similar News
News January 17, 2026
సూర్యాపేట: మున్సిపల్ నగారాకు ముందే రాజకీయ సెగలు

సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లో ఎన్నికల వేడి మొదలైంది. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి అభ్యర్థుల ఎంపికలో సర్వేలకే ప్రాధాన్యత ఇస్తామని పార్టీలు సంకేతాలిస్తుండటంతో ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. సామాజిక సమీకరణాలు, ప్రజాభిప్రాయం ఆధారంగానే టికెట్ల కేటాయింపు ఉంటుందని భావిస్తుండటంతో.. గెలుపు గుర్రాల అన్వేషణలో నాయకత్వం నిమగ్నమైంది.
News January 17, 2026
ఉమ్మడి ఓరుగల్లులో అతివలకు 149 డివిజన్లు!

ఉమ్మడి వరంగల్‌లోని 12 మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 11 మున్సిపాలిటీలు, 1 గ్రేటర్ కార్పొరేషన్‌లోని వార్డులు, డివిజన్లకు రిజర్వేషన్లు ప్రభుత్వం ఖరారు చేసింది. మొత్తం 326 వార్డులకు 149 వార్డులను మహిళలకు రిజర్వ్ చేశారు. ST(మ) 15, SC(మ) 23, BC(మ) 39, జనరల్(మ) 72 వార్డులను రిజర్వ్ చేశారు. ఈరోజు సా.4 గం.కు కలెక్టర్లు ఏ డివిజన్ ఎవరికో ప్రకటించనుండటంతో ఆశావహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
News January 17, 2026
మెదడు ఇచ్చే ముందస్తు సంకేతం.. నెగ్లెక్ట్ చేయొద్దన్న వైద్యులు!

మెదడుకు రక్తప్రసరణ తాత్కాలికంగా నిలిచిపోవడాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది భవిష్యత్తులో రాబోయే భారీ స్ట్రోక్‌కు ముందస్తు హెచ్చరిక లాంటిదని ప్రముఖ వైద్యుడు సుధీర్ కుమార్ హెచ్చరించారు. మాట తడబడటం, కంటిచూపు మందగించడం వంటి లక్షణాలు నిమిషాల్లో తగ్గిపోయినా వాటిని నిర్లక్ష్యం చేయకూడదని తెలిపారు. ఇవి కనిపిస్తే వెంటనే వైద్యుడిని కలవడం ద్వారా 80% వరకు మేజర్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించవచ్చని సూచించారు.


